దేశంలో ఇపుడు పరిస్థితి ఎలా ఉంది అని ఒక్కసారి ఆలోచిస్తే భయమే వేస్తోంది అంటున్నారు మేధావులు. కరోనా కేసులు లక్షల్లో రోజుకు వస్తూ ప్రపంచ రికార్డుని సృష్టించిన నేపధ్యం ఒక వైపు ఉంది.

మరో వైపు కరోణా మరణాలు ప్రతీ రోజూ పెద్ద ఎత్తున నమోదు అవుతూ భారత దేశాన‌ మరణ మృదంగానే మోగిస్తున్నాయి. దీని మీద దేశ అత్యున్నత న్యాయం స్థానమే ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో పరిస్థితి అల్లకల్లోలంగా ఉందని కూడా సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. కరోనాకు సంబంధించి అత్యవసర మందులకు కొరత ఏర్పాడడం, ఆక్సిజన్ లేకపోవడం, మరో వైపు వ్యాక్సిన్ విషయంలోనూ కేంద్రం మీద సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం ప్రస్తుత పరిస్థికి అద్దం పడుతోంది.

కరోన మహమ్మారి వీర విహారం చేస్తూంటే తీసుకున్న కేంద్రం చర్యలు ఏంటని సుప్రీం కోర్టు గట్టిగానే కేంద్రాన్ని నిలదీసింది. కరోనాని కట్టడి చేసేందుకు ఒక జాతీయ విధానం అవసరం అని కూడా అభిప్రాయపడింది. దేశంలో జాతీయ ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్న సుప్రీం కోర్టు సుమోటోగా కేసుని టేకప్ చేయడం విశేషం. ఇక కరోనాని అరికట్టే విషయంలో కేంద్రం ఏం చేయాలనుకుంటోందో జాతీయ ప్రణాళికను కోర్టుకు తెలియచేయాల‌ని కోరడం విశేషం.

మొత్తానికి చూస్తే కేంద్ర రాష్ట్రాల మీద బాధ్యత మోపుతోంది. రాష్ట్రాలకు ఎక్కడికక్కడ తీసుకుంటున్న చర్యలు ఏ మాత్రం సరిపోవడంలేదు అందుకే జాతీయ విధానం ఈ విషయంలో అవసరం అని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. మొత్తానికి చూసుకుంటే దేశం పెను ఆరోగ్య విపత్తు దిశగా సాగుతోంది అంటున్నారు. ఎక్కడ చూసినా కరోనా కేసులు చాలా ఎక్కువగా ఉన్నాయి. బయటకు వస్తున్న నంబర్ల కంటే కూడా చాలా ఎక్కువగానే దేశంలో కరోనా వైరస్ ఉందని అంటున్నారు. ఈ విషయంలో ఇప్పటికే అలసత్వం జరిగిందన్న భావన అన్ని వైపుల నుంచి ఉంది. ఇంకా చోద్యం చూడకుండా పాలకులు ఆ దిశగా కచ్చితమైన చర్యలు తీసుకోవాలని అంతా కోరుతున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: