కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఈ మధ్య స్పీడ్ పెంచేశారు. రాజకీయంగా కూడా తెగ హుషార్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ గతంలో ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చినా కూడా అది అభాసు పాలు అయ్యేది. కానీ ఇపుడు ఆయన పక్కా క్లారిటీగా ఉంటున్నారు.

కరెక్ట్ గానే తాను చెప్పాలనుకుంటున్నది చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో రాహుల్ అనేక సలహాలు కేంద్రానికి ఇచ్చారు. మొదట వాటిని కాదని సెటైర్లు వేసిన కేంద్ర పెద్దలే చివరికి వాటిని ఆమోదించిన సంగతిని ఇక్కడ గుర్తుంచుకోవాలి. దేశంలో వ్యాక్సిన్ కొరత ఎక్కువగా ఉందని, విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని రాహుల్ మొదట కోరితే ఆయనకు దేశ భక్తి లేదు అని కేంద్ర పెద్ద విమర్శలు చేశారు.

అదే విధంగా స్వదేశీ టీకా పట్ల మరీ అంత చులకన అంటూ కూడా వేళాకోళమాడారు. కానీ చివరకు దేశంలో వ్యాక్సిన్ కొరత చాలా ఎక్కువ కావడంతో కేంద్రమే రష్యాకు చెందిన వ్యాక్సిన్ ని దిగుమతి చేసుకోవడానికి రెడీ అయింది. అంటే రాహుల్ ఇచ్చిన సలహా మంచిదే అని రుజువు అయింది. అలాగే వ్యాక్సిన్ అన్ని వర్గాలకు సరఫరా చేయాలని మొదట కోరింది కూడా రాహులే. కానీ చివరికి కేంద్రం కూడా ఈ డిమాండ్ కు అంగీకరించి మే 1 నుంచి 18 ఏళ్లు దాటిన వారికి అందరికీ వ్యాక్సిన్ ఇస్తామని చెప్పింది.

ఇక రాహుల్ గాంధీ కేంద్రం మీద వేస్తున్న బాణాలు కూడా అందరినీ ఆలోచింపచేసేవిలా ఉంటున్నాయి. టీకా ఉత్సవ్ అన్నారు కానీ సరిపడా టీకాలు లేకుండా ఎలా ఉత్సవ్ చేస్తారు అని ఆయన నిలదీసిన తీరుతో జనాలు కూడా అంగీకరిస్తున్నారు. ఆర్భాటాలు, ప్రచారాలు ఆపేసి ముందు కరోనా కట్టడికి అందరి సూచనలతో కదలాలని కూడా రాహుల్ కోరుతున్నారు. మొత్తానికి కరోనా విపత్కర సమయంలో ప్రభుత్వానికి నిర్మాణాత్మక సూచనలు చేయడం ద్వారా రాహుల్ బాగానే తన పాత్రను పోషిస్తున్నారు అంటున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: