కరోనా వ్యాక్సిన్ ఇపుడు ఏకైన ఆయుధంగా మారుతోంది. దీని వల్ల కరోనా వచ్చినా కూడా ప్రాణాపాయం లేకుండా ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే చాలా మటుకు వ్యాక్సిన్ వల్ల కరోనా నుంచి బయటపడే అవకాశం ఉంది.

ఈ నేపధ్యంలో కరోనా వ్యాక్సిన్ అంటే జనాలు ఆసక్తిని చూపిస్తున్నారు. మొదట్లో వ్యాక్సిన్ ల మీద అపోహలతో జనాలు దూరంగా ఉన్నా కూడా ఇపుడు కరోనా బీభత్సం చూసి వ్యాక్సిన్ కావాలని అంటున్నారు. వ్యాక్సిన్ కోసం బారులు తీరి కూడా వేయించుకుంటున్నారు.

ఇక మోడీ సర్కార్ మొదట అరవై ఏళ్ల పై బడిన వారికే వ్యాక్సిన్ అంటూ నిబంధనలు పెట్టింది. ఆ తరువాత 45 ఏళ్లు దాటిన వారికి కూడా వ్యాక్సిన్  వేయడానికి అనుమతించింది. ఇవన్నీ కూడా ఉచితంగానే ఇస్తున్నారు. అయితే మే 1 నుంచి 18 ఏళ్ల పైబడిన వారికి ఇచ్చే వ్యాక్సిన్లు మాత్రం ఉచితంగా ఇవ్వరు. వీటిని బహిరంగ మార్కెట్ లో అమ్మకానికి ఉంచుతారు. వాటిని ప్రైవేట్ ఆసుపత్రులలో అయినా జనాలు కొనుగోలు చేసుకుని వేసుకోవాల్సిందే.

అయితే దీని మీద మోడీ సర్కార్ విధానాలపైన కేరళ సర్కార్ గట్టిగానే ఆగ్రహించింది. అక్కడ ముఖ్యమంత్రి విజయన్ మొత్తం అందరికీ వ్యాక్సిన్ ఉచితంగా  వేయాలని కోరారు. ఒకవేళ వేయకపోతే తామే వేయిస్తామని చెప్పారు. అలా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వ్యాక్సిన్ ఉచితంగా వేసే బాధ్యతను స్వీకరించాయి. తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే అటు కేసీయార్ సర్కార్ ఇటు జగన్ ప్రభుత్వం కూడా వ్యాక్సిన్ 18 ఏళ్ల పై బడిన వారికి ఉచితంగా వేయడానికి రెడీ అవుతోందని అంటున్నారు. మొత్తానికి చూస్తే దీని శుభవార్తగానే భావించాలి. ఇదిలా ఉంటే కరోనా వ్యాక్సినేషన్ గట్టిగా చేపట్టినట్లు అయితేనే ఆ మహమ్మారిని దూరం చేయగలమని వైధ్య నిపుణులు అంటున్నారు. కరోనా విషయంలో తీసుకునే నివారణ చర్యలలో మొట్టమొదటి ఆయుధమే వ్యాక్సినేషన్. ఈ విషయంలో ఉచితంగా వేయకపోతే చాలా మంది వ్యాక్సిన్ కి దూరంగా ఉండిపోయే ప్రమాదం ఉంది అంటున్నారు.





మరింత సమాచారం తెలుసుకోండి: