మొన్నటివరకు కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఎన్ని విధాలుగా చెప్పినా సరే చాలామంది ముందుకు వచ్చే ప్రయత్నం చేయలేదు. ఒక పక్కన కరోనా తీవ్రత పెరుగుతున్నా సరే చాలా మంది వ్యాక్సిన్ విషయంలో వెనకడుగు వేయడం పట్ల ఆందోళన వ్యక్తమైంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సిన్ కి సంబంధించి ఎన్ని విధాలుగా ప్రచారం నిర్వహించిన సరే ప్రజలు మాత్రం ముందుకు రాకపోవడంతో వ్యాక్సిన్ నిల్వలు కూడా అనవసరంగా పాడైపోయిన పరిస్థితి ఉంది. ప్రముఖులు కూడా కొంతమందికి వ్యాక్సిన్ తీసుకోవడానికి ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి ఉన్న సంగతి తెలిసినదే.

కొంతమంది ప్రముఖులు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ప్రాణాలు కోల్పోయారు అని ప్రచారం కూడా ఎక్కువగా జరిగింది. ఒక తమిళ నటుడు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ప్రాణాలు కోల్పోయాడు అని వార్తలు కూడా వచ్చాయి. దీంతో చాలామంది తీసుకోవడానికి భయపడటంతో కేంద్ర ప్రభుత్వం కూడా వ్యాక్సిన్ విషయంలో ఆందోళన వ్యక్తం చేసింది. అయితే ఈ తరుణంలో భారీగా కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోవడంతో ప్రజలందరూ కూడా వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి ఉంది. మొదటి సారి తీసుకున్న వాళ్ళు రెండోసారి తీసుకోవడానికి ఇబ్బంది పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

అంతేకాకుండా వ్యాక్సిన్ ధర కూడా భారీగా పెరిగిపోతుంది. రష్యా తయారుచేసిన వ్యాక్సిన్ ధర 750గా  ఆ దేశం ప్రకటించింది. ఇక అమెరికా కూడా తమ దేశంలో తయారు చేసిన వ్యాక్సిన్ ధర పెంచింది. మన దేశంలో కూడా పెరిగే అవకాశాలు ఉండవచ్చు అని అంచనాలు వేస్తున్నారు. ఇప్పటికే వ్యాక్సిన్ తయారీ విషయంలో ముడి పదార్థాల కొరత ఉంది అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినబడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు వ్యాక్సిన్ తయారీకి సంబంధించిన ఆందోళన మొదలైంది. దీంతో అసలు ప్రజలకు వ్యాక్సిన్ దొరుకుతుందా లేదా అనే దానిపై అనుమానాలు మొదలయ్యాయి. అయితే మన దేశంలో వ్యాక్సిన్ ధరకు సంబంధించి ఇంకా ఎటువంటి స్పష్టత కూడా రావడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: