ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరిక్షలకు సంబంధించి ఇప్పుడు కాస్త ఆందోళన ఉన్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలను నిర్వహించడం కరెక్ట్ కాదని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖామంత్రి ఆదిమూలపు సురేష్ మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఒకటి నుండి 9 తరగతి వరకూ విద్యార్ధులను ప్రమోట్ చేశాము అని ఆయన అన్నారు. రెసిడెన్షియల్ పాఠశాలల్లో 9 తరగతి వరకూ విద్యార్ధులను ఖాళీ చేయించి హస్టళ్ళు మూసి వేశాం అని ఆయన వివరించారు.

పదవతరగతి, ఇంటర్మిడియట్ పరీక్షలను ఇంకా సమయం ఉన్నందన వాటని అప్పడు సమీక్షించాలని నిర్ణయించాము అని ఆయన తెలిపారు. లోకేష్ ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలను  ఖండిస్తున్నాము అని అన్నారు. లోకేష్ స్టాన్ఫర్డ్ డిగ్రీలు నిజమే అయితే రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాన్ని అభినందించాలి అని ఆయన సూచించారు. ముఖ్యమంత్రి జగన్ పై లోకేష్ చేస్తున్న కామెంట్స్ చూస్తే ఆయన్ను అందరూ ఎర్రినాయుడు అంటారు అని ఎద్దేవా చేసారు. ఎవరో ఫీజులు కడితే  ఎవరో పరీక్షలు రాస్తే స్టాన్ ఫర్ట్ లో చదువుకున్ననని నువ్వు చెప్పుకుంటున్నావు అని ఎద్దేవా చేసారు.

70 లక్షల మందికి వైరెస్ సోకే ప్రమాదం ఉందని లోకేష్ పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారు అని మండిపడ్డారు. వకీల్ సాబ్ సినిమా గురించి చంద్రబాబు నాయుడు పోరాటం చేస్తూ 6 షోలు ఇవ్వాలన్నారు, వకీల్ షాబ్ గురించి వకాల్తా పుచ్చుకున్నారు అని అన్నారు. వరుసగా రెండవ సంవత్సరం పరీక్షలు లేకుండా ముందుకు  వెళ్తే పరిస్థితులు ఎలా వుంటాయో లోకేష్ ఆలోచించాలి అని ఆయన సూచించారు. విద్యార్థులకు సెలవులలో కూడా మద్యాహ్నం భోజన పథకాన్ని అమలు చేస్తామని స్పష్టం చేసారు. ప్రైవేట్ విద్యా సంస్థలలో కోవిడ్ నిబంధనలు సరిగా లేవన్న ఆరోపణలు వస్తున్నాయి అని ఆయన చెప్పుకొచ్చారు. అవసరం అయితే అలాంటి సంస్ధలపై చర్యలు తీసుకుంటాం అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: