దేశ వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నాయి అని ఏపీ ఆరోగ్య శాఖా మంత్రి ఆళ్ళ నానీ అన్నారు. సీఎం జగన్ నిరంతరం పరిస్థితి ని సమీక్షిస్తున్నారు అని ఆయన తెలిపారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఏం చర్యలు తీసుకోవాలి, వ్యాప్తి నిరోధానికి చేపట్టాల్సిన చర్యలు పై. చర్చించాం అన్నారు. ఆస్పత్రుల్లో పడకల సంఖ్య పెంపు, కోవిడ్ కేర్ కేంద్రాలను పెంచటం, రెమెడిసివిర్ ఇంజెక్షన్, ఆక్సిజన్ కొరత లాంటి అన్ని అంశాలు చర్చించాం అని చెప్పుకొచ్చారు. కోవిడ్ నియంత్రణ కోసం, ప్రజల కు సందేహాలు నివృత్తి, ఫిర్యాదుల స్వీకరణ కోసం 104 కాల్ సెంటర్ బలోపేతం చేయాలని నిర్ణయం తీసుకున్నాం అని ఆయన పేర్కొన్నారు.

మందులు, ఆక్సిజన్ కొరత దేశంలో ఉంది. ఏపీలోను ఇబ్బందులు ఉన్నపటికీ దాన్ని ఎదుర్కొనేందుకు కార్యాచరణ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నాం అని తెలిపారు. రేపు సీఎం దగ్గర జరిగే సమీక్ష లో ఈ అంశాలను ప్రస్తావించి మెరుగైన చర్యలు చేపడతాం అన్నారు ఆయన. ప్రైవేటు ఆస్పత్రులు ప్రభుత్వం నిర్దేశించిన ఫీజు మాత్రమే వసూలు చేయాలి అని పేర్కొన్నారు. లేకపోతే కఠిన చర్యలు తీసుకోడానికి వెనుకాడబోము అని హెచ్చరించారు. ప్రజలు మాస్కు లు, భౌతిక దూరం లాంటి జాగ్రత్తలు తీసుకుని కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి కృషి చేయాలి  అని సూచించారు.

వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా వేగంగా పూర్తి చేసే దుకు ప్రయత్నం చేస్తున్నాం అని ఆయన అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 360 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం అవుతోంది. ప్రభుత్వ ఆస్పత్రులకు ఇబ్బంది లేదు అని స్పష్టం చేసారు. ఆక్సిజన్ ప్లాంట్ పెట్టేందుకు కేంద్రం సహకారం అందిస్తామని తెలిపింది అని, ఏపీలో 49 లక్షల మందికి వ్యాక్సినేషన్ వేశాం అని ఆయన తెలిపారు. 18 ఏళ్ల పైబడిన వ్యక్తులకు వ్యాక్సినేషన్ వేసే విషయంలో ఇంకా స్పష్టత లేదు అని అన్నారు. సీఎం దగ్గర చర్చించి నిర్ణయం తీసుకుంటాం అని ఈ సందర్భంగా వివరించారు. కరోనా పరీక్షల సామర్ధ్యం పెంచుతామని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: