ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపధ్యంలో రాష్ట్ర సర్కార్ అన్ని విధాలుగా అలెర్ట్ అవుతుంది. కేసుల కట్టడికి సంబంధించి సిఎం వైఎస్ జగన్ చాలా జాగ్రత్తగా చర్యలు తీసుకుంటున్నారు. ఏపీలో ఆక్సీజన్ కొరత కూడా భారీగా ఉన్న నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అలెర్ట్ అయింది. మంత్రి మేకపాటి గౌతం రెడ్డి ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తగా చర్యలు తీసుకుంటూ సిఎం జగన్ ఆదేశాలను కూడా పాటిస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో నాలుగు జిల్లాలకు కరోనా తీవ్రత చాలా ఎక్కువగా ఉంది అని ఏపీ సర్కార్ తెలిపింది.

కృష్ణా జిల్లాలో  భారీగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ కేసుల కట్టడికి రాష్ట్ర సర్కార్ చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తుంది. ఇక కృష్ణా జిల్లా యంత్రాంగం మొత్తం కూడా ఆక్సీజన్ మీద దృష్టి సారించింది. విజయవాడలో బెడ్ ల కొరత కూడా చాలా తీవ్రంగా ఉందని మీడియా వర్గాలు అంటున్నాయి. ఈ నేపధ్యంలో కృష్ణ జిల్లా కలెక్టర్ ఏ ఎండి ఇంతియాజ్ మీడియాతో మాట్లాడారు. కృష్ణా జిల్లాలో 26 ఆసుపత్రుల ద్వారా  కోవిడ్ వైద్య సేవలు అందించేందుకు ఎంపిక చేసాం అని ఆయన తెలిపారు. ఈ ఆసుపత్రిలో వైద్య సేవలను పర్యవేక్షణ కోసం పర్యవేక్షకులుగా డాక్టర్ లను నియమించాము అని ఆయన వ్యాఖ్యానించారు.

రోగులకు మెరుగైన వైద్య సేవలు  అందించేందుకు భాదితుల జాయినింగ్ , అందుతున్న నవైద్య సేవలను నోడల్ అధికారిగా  వ్యక్తిగతంగా పర్యవేక్షణ చేపడతారు అని తెలిపారు.  ఇందుకోసం జిల్లా స్థాయి అధికారులను 26 ఆసుపత్రులను నియమించాము అని వివరించారు. కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా ప్రజ లకు నిరంతరం వైద్య సేవలు, సూచనలు , సలహాలు ఇచ్చేందుకు 104 కాల్ సెంటర్ ఏర్పాటు చేసామని అన్నారు. డాక్టర్ల, నోడల్ అధికారుల ఫోన్ నెంబర్ అందుబాటులో ఉంచుతున్నాము అని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: