విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడతామని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. దాంతో విశాఖలో ఆగ్రహ జ్వాలలు ఎదురయ్యాయి.   అయితే కేంద్రం మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని క్లారిటీ ఇచ్చేసింది. కార్మికులంతా ఉద్య‌మం మొద‌లు పెట్టారు. అయితే ప్ర‌స్తుతం దేశంలో క‌రోనా విజృంభ‌న కొన‌సాగుతున్న నేప‌థ్యంలో కార్మికులు ప‌ట్టింపుల‌కు పోకుండా విధులు నిర్వ‌హిస్తూ ఆక్సీజ‌న్ ఉత్ప‌త్తికి కృషి చేస్తున్నారు. దాంతో విశాక ఉక్కు మ‌ళ్లీ లాభాల్లోకి వెలుతోంది. అయితే తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ గొప్ప తనాన్ని వివరిస్తూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటికరణ చేయడం ఎంతవరకు సమంజసం అంటూ మెగాస్టార్ చిరంజీవి ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ రోజుకు 100 టన్నుల ఆక్సిజన్ ను ఉత్పత్తి చేసి ప్రజల ప్రాణాలను కాపాడుతుందని చిరంజీవి అన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా మెగాస్టార్ కేంద్రాన్ని కడిగి పారేశారు. చిరు తన ట్వీట్ లో..."దేశమంతా ఆక్సిజన్ దొరక్క కరోనా పేషెంట్స్ అల్లాడిపోతున్నారు. 

ఈ రోజు ఓ స్పెషల్ ట్రైన్ విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి చేరుకుంది. అక్కడి నుంచి 150 టన్నుల ఆక్సిజన్ ను మహారాష్ట్రకు తీసుకు వెళుతోంది. విశాఖ ఉక్కు కర్మాగారం రోజుకి సుమారు 100 టన్నుల ఆక్సిజన్‌ను ఉత్పిత్తి చేస్తుంది. ఇప్పుడున్న అత్యవసర పరిస్థితిలో ఎన్నో రాష్ట్రాలకు ఆక్సిజన్ అందించి లక్షల మంది ప్రాణాలని నిలబెడుతోంది. అలాంటి విశాఖ ఉక్కు కర్మాగారం నష్టాల్లో ఉందని ప్రైవేట్‌పరం చేయడం ఎంత వరకు సమంజసం??? మీరే ఆలోచించండి అంటూ మెగాస్టార్ కేంద్రాన్ని ప్ర‌శ్నించారు. ఇదిలా ఉండ‌గా ఇదివ‌ర‌కే చిరంజీవి ఉక్కు ఉద్య‌మానికి త‌న మ‌ద్ద‌తు ఉంటుంద‌ని తెలిపారు. ఇప్పుడు మ‌రోసారి కేంద్రాన్ని ప్ర‌శ్నిస్తూ ట్వీట్ చేశారు. ఇదిలా ఉండ‌గా చిరంజీవి పోస్ట్ కు కొంత మంది స‌పోర్ట్ చేస్తుండ‌గా మ‌రికొంద‌రు వ్య‌తిరేకంగా కామెంట్స్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం రిల‌య‌న్స్, టాటా లాంటి సంస్థ‌లు కూడా ఆక్సిజ‌న్ ను ఇస్తున్నాయి క‌దా.?అంటూ ప్ర‌శ్న‌లు వేస్తున్నారు. అయితే ప్రైవేటు వ్య‌క్తుల చేతుల్లోకి వెలితే కార్మికులకు న‌ష్టం జ‌రుగుతుంని ఆలోచించడం లేదు.



 

మరింత సమాచారం తెలుసుకోండి: