కరోనా వచ్చిన తర్వాత చాలా మంది లైట్ గా తీసుకుంటున్నారు. అయితే.. కరోనా లక్షణాలు ఏమాత్రం ఉన్నా.. డాక్టర్ సంరక్షణలో మందులు వాడటం అవసరం. ఇక్కడ డాక్టర్లు చేసే పని మీ ఆక్సిజన్ శాతాన్ని టెంపరేచర్ ని పల్స్‌రేట్‌ ని అవి పెరుగి తరుగుతున్న విధానాన్ని ఏరోజుకారోజు అంచనా వేసి..అవసరమైతే ఆసుపత్రికి రిఫర్ చేయగలరు. సీటీ స్కాన్ అందరికీ అవసరం ఉండకపోవచ్చు. ఇతర జబ్బులకు చెందిన పేషంట్లు అధికంగా ఉండే కొన్ని ఆసుపత్రులలో కరోనాను రూలౌట్ చేయడం కోసం సీటీ స్కాన్ స్క్రీనింగ్ తప్పనిసరి చేశారు.

ఆర్టీ పీసీఆర్ వచ్చే వరకు ఆలస్యమౌతుంది కనుక స్క్రీనింగ్ తప్పనిసరి అయింది. డాక్టర్ సంరక్షణలో లేకపోతే ఈ మార్పులను పేషంట్లు గుర్తించలేరు. ఆక్సిజన్ శాతం బాగా తగ్గిపోయాక హడావుడిగా ఆసుపత్రికి రావడం వలన ఉపయోగం పెద్దగా ఉండదు. కరోనా వచ్చాక పానిక్ అవసరం లేదు. నేటికి 90 - 95 శాతం మందికి ఎలా వచ్చిందో అలాగే తగ్గిపోతుంది. 10 శాతం మందికి ఆసుపత్రిలో అడ్మిషన్ అవసరం ఔతుంది. గత సంవత్సరం నుండి ఇప్పటికి కొన్ని వందల మందిని కరోనా పేషంట్లకు అందిస్తే.. ఒకరి ద్దరికే ఆసుపత్రి అవసరం పడింది.

అయితే.. ఈసారి ప్రజలలో నిర్లక్ష్యం పెరగడం వలన ఆసుపత్రులలో అడ్మిషన్ కావలసిన వారి శాతం కూడా పెరిగింది. హోం ఐసోలేషన్లో ఉన్నా ఆసుపత్రిలో ఉన్నా కరోనా వచ్చిన వారిలో బాగా నీరసం ఉంటుంది. ప్రతి రెండు గంటలకూ ఏదో ఒకటి తింటూ ఉండటం చాలా ముఖ్యం. నీరసం పెరుగుతోంది అంటే సరిగా తినడం లేదని అర్థం. వైద్యుల పర్యక్షణ వలన సీరియస్ నెస్‌ను వారు సరిగ్గా గుర్తిస్తారు. ఆసు పత్రులలో పేషంట్ల అటెండర్లు తమ పేషంట్ తినడానికి కూడా ఏదైనా అరేంజ్ చేయవచ్చు. అందుకే కరోనా లక్షణాలు ఉంటే.. ఏమాత్రం నిర్లక్ష్యం వహించవద్దు.


మరింత సమాచారం తెలుసుకోండి: