ఆక్సీజన్.. ఆక్సీమీటర్.. ఈ పదాలు ఇప్పుడు బాగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు కరోనా వస్తే ఆక్సీమీటర్‌తో ఎప్పటి కప్పుడు చెక్ చేసుకుంటున్నారు. సాధారణంగా కరోనా లక్షణాలు మొదలైన తర్వాత రెండు వారాలు చాలా ముఖ్యం. మొదటి వారంలో లక్షణాలు కనిపించి రెండవవారంలో ఆక్సిజన్ శాతం పడిపోయే అవకాశం ఉంది. రెండవవారంలో ఆక్సిజన్ శాతం పడిపోకుండా ఉండాలంటే మొదటివారంలోనే సరైన ట్రీట్మెంట్ డాక్టర్ పర్యవేక్షణలో తీసుకోవడం అవసరం.

 
ఆక్సిజన్ కొద్దిగా పడిపోయినపుడే అంటే  ఎస్‌పీఓటూ  94% కంటే తక్కువవడం రెండో వారంలో జరగవచ్చు. కాబట్టి రెండవవారంలో ప్రతి మూడుగ గంటలకు ఒకసారి ఆక్సిమీటర్ ని చూసుకుంటూ ఉండాలి. 93 శాతం కంటే తక్కువగా ఉంటే వెంటనే మీ డాక్టర్ దృష్టికి తీసికెళ్ళాలి. 93 శాతం పడిపోగానే వెంటనే ఆసుపత్రులకు ఉరకనవసరం లేదు. ముందు మీ డాక్టర్ తో మాట్లాడటం అవసరం. జ్వరం లేకుండా దగ్గులేకుండా  నీరసం లేకుండా ఠపీమని ఆక్సిజన్ శాతం పడిపోవడం జరగదు.

అందుకే మీ డాక్టర్ ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటారు. మీరు హుషారుగా ఉండి లక్షణాలు లేకుండా ఉన్నప్పుడు ఆక్సిజన్ తగ్గుతుంది అంటే సింపుల్ గా పల్స్ ఆక్సిమీటర్ సరి చూసుకోండని చెబుతారు. లేదు నిజంగానే తగ్గుతుంది అంటే మిగితా రిస్కు ఫ్యాక్టర్స్ ని దృష్టిలో ఉంచుకుని కొన్ని మందులు సజెస్ట్ చేసే అవకాశం ఉంది. వాటిని ఇంటిలోనే ఉండి వేసుకోవచ్చు. 93 శాతానికి ఠపీమని పడిపోదు అంటే ఏమని అర్థం..?. 98 నుంచి 97..96..95..94..93 ఇలా రావాలి కదా..దీనికి రెండు మూడు రోజులు పట్టవచ్చు. అందుకే మీరు రోజూ డాక్టర్ తో కాంటాక్ట్ లో ఉండగలిగితే డౌన్ ట్రెండ్ మొదలైనపుడే ట్రీట్మెంట్ ప్లాన్ మార్చే అవకాశం డాక్టర్ కి పెరుగుతుంది. ట్రీట్మెంట్ సులభతరమౌతుంది.


93 శాతం ఆక్సిజన్ పడిపోయేవరకు పేషంట్ ని ఎవరు పలకరించలేదు అంటే అతడిని ఎవరూ మానిటర్ చేయడం లేదన్మాట. నిర్లక్ష్యం వహించారన్మాట. అప్పటికీ కంగారు అవసరం లేదు. డాక్టర్ తో మాట్లాడగలిగితే చాలు. చాలామంది సొంత వైద్యం తీసుకోవడం వలన తీరా ఆక్సిజన్ శాతం 93% కంటే తగ్గిపోయాక డాక్టర్లకు ఫోన్లు చేస్తు ఆస్పత్రులవైపు పరుగులు పెడుతుండటంతో పడకల సమస్యలు పెరుగుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: