మహమ్మారి కరోనా మారణహోమం సృష్టిస్తుంది. శరవేగంగా వ్యాప్తిచెందుతూ అందరి ప్రాణాలను అరచేతిలో పట్టుకుని బతికే పరిస్థితులు తీసుకొస్తుంది. రోజురోజుకు శరవేగంగా  వ్యాప్తి చెందుతున్న ఈ మహమ్మారి అందరినీ బెంబేలెత్తిస్తోంది. అయితే కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఎక్కడ ఈ మహమ్మారి వైరస్ వ్యాప్తి మాత్రం తగ్గడం లేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అయితే ప్రజలందరికీ ఈ మహమ్మారి వైరస్ పై పూర్తి స్థాయి అవగాహన ఉన్నప్పటికీ కొంత మంది మాత్రం  వైరస్ కేసులు భారీగా పెరుగుతుండడంతో ఆందోళన చెందుతున్నారు.



 బయటికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళాలి అంటే భయపడిపోతున్నారు. ఎందుకంటే బయట దుస్తులపై లేదా తమ చేతులకు అంటుకున్న కరోనా వైరస్ ఇంట్లో వాళ్లకి సోకుతుందేమో అని  భయపడి పోతున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే అసలు ఇంట్లో కి వెళ్లాలా వద్దా అని ఎంతో ఆందోళన చెందుతున్నారు చాలామంది.  అయితే ఇలా వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్ళిన వాళ్ళు ఇంట్లోకి వెళ్లేముందు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు నిపుణులు. ఇక వివిధ పనుల నిమిత్తం బయట నుంచి ఇంటికి వచ్చిన తర్వాత తప్పనిసరిగా వేడి నీటితో శుభ్రంగా స్నానం చేయడం ఎంతో మంచిది అని సూచిస్తున్నారు.



 అంతేకాకుండా బయటకు వెళ్లి వచ్చాక కొంతమంది కేవలం చేతులను మాత్రమే శుభ్రంగా కడిక్కుంటూ ఉంటారు. అయితే చేతుల తో పాటు వాచ్ ఫోన్ లాంటివి కూడా శానిటైజ్ చేయాలి.  అంతేకాకుండా వేడినీటితో మాస్కులు ఉతకాలి ఇక బట్టలు కూడా వేడినీటితో ఉతకడం ఎంతో ఉత్తమం. అంతేకాకుండా ఒకవేళ మీరు లిఫ్ట్ బటన్ నొక్కి ఉన్నట్లయితే వెంటనే చేతులను శానిటైజ్ చేసుకోవడం బెటర్. ఇక మెట్లు ఎక్కేటప్పుడు రైలింగ్ తాగకపోవడం ఎంతో మంచిది. అంతే కాకుండా మార్కెట్ నుంచి తీసుకువచ్చిన కూరగాయలను అరగంట పాటు ఉప్పు నీటిలో నానబెట్టిన తర్వాత కడిగి ఆ తర్వాత ఫ్రిజ్ లో నిల్వ ఉంచడం మంచిది అని సూచిస్తున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: