ఈ మధ్య కాలంలో ఎన్నో చిత్రవిచిత్రమైన ఘటనలు వెలుగులోకి వస్తు ఎంతో మందిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అయితే ఇలాంటి చిత్రవిచిత్రమైన ఘటనలు వెలుగులోకి వచ్చినప్పుడు ఇది నిజంగా నిజమేనా అని నమ్మడానికి కూడా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది.   సోషల్ మీడియా పుణ్యమా అని దేశంలో ఎక్కడో జరిగిన ఘటనలు కూడా క్షణాల్లో వ్యవధిలోనే చేతి ముందు వాలిపోతున్నాయి.  ఇలాంటి ఘటనలకు సంబంధించిన వార్తలు చదివినప్పుడు కానీ లేదా వీడియోలు చూసినప్పుడు కానీ అందరూ అవాక్కవుతుంటారు. ఇక్కడ ఇలాంటి వార్త ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది.



 ఇక్కడ ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు అయితే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు అంటే ఏదో పెద్ద కారణం అయ్యే ఉంటుంది అని అనుకుంటారు ఎవరైనా. మీరు కూడా అలా అనుకున్నారు అంటే ఇక పప్పులో కాలేసినట్లే..  ఎందుకంటే ఆ వ్యక్తి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి కారణం కోడిగుడ్డు పెట్టకపోవడమే..  ఏంటి అవాక్కవుతున్నారు కదా.. కోడి గుడ్డు పెట్టకపోతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం ఏంటి... ఇలా కూడా చేస్తారా  అని అనుకుంటున్నారా అయితే దీని వెనక అసలు స్టోరీ ఏంటో తెలుసుకుందాం రండి.



 కోళ్లు గుడ్లు పెట్టడం లేదు అన్న కారణంతో దాన అమ్మిన కంపెనీ పై వ్యక్తి కేసు పెట్టిన ఘటన మహారాష్ట్రలోని వెలుగులోకి వచ్చింది. పుణే కి చెందిన ఓ వ్యక్తి కోళ్ల ఫారం నడుపుతున్నాడు ఈ క్రమంలోనే ఇటీవల అహ్మదాబాద్ లోని ఓ కంపెనీ నుంచి దానా కొని కోళ్ళకి వేస్తున్నాడు. ఆ దాన తినిపించినప్పుడు నుంచి కోళ్లు అన్నీ కూడా మొండికేసాయని గుడ్లు పెట్టడమే మానేసాయి అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు సదరు వ్యక్తి. అయితే గతంలో కూడా ఇలాంటి కేసులు వచ్చాయని ఇక అధికారులతో దాన కంపెనీ నిర్వాహకులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని అంటూ పోలీసులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: