ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దవుతుందా.. ఆయన మరోసారి జైలు ఊచలు లెక్కించక తప్పదా.. జగన్‌ను మరోసారి జైల్లో పెట్టించాలన్న ఎంపీ రఘురామ కృష్ణంరాజు పంతం నెరవేరుతుందా.. జగన్‌ బెయిల్ రద్దు చేసే వరకూ ఏపీలో అడుగు పెట్టేది లేదన్న ఎంపీ రఘురామ కృష్ణంరాజు ప్రతిజ్ఞ నేరవేరబోతోందా.. ఇప్పుడు ఈ ప్రశ్నలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఏపీ సీఎం జగన్ ఏళ్ల తరబడి బెయిల్ పైనే ఉన్నారు. ఆయన దాదాపు 11 కేసుల్లో ఏ వన్‌గా ఉన్న విషయమూ తెలిసిందే.  


ఏపీ ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు చెయ్యాలని సీబీఐ కోర్టులో ఎంపీ రఘురామ కృష్ణరాజు వేసిన పిటిషన్ ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. ఈ పిటిషన్‌ను సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించింది.  ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జగన్‌పై 11 చార్జ్ షీట్‌లను గతంలో సీబీఐ నమోదు చేసింది. ప్రతి చార్జ్ షీట్‌లో జగన్ ఏ-1 గా ఉన్నారన్నది రఘురామ కృష్ణంరాజు  వాదన.  పిటిషనర్ పేర్కొన్నారు.   జగన్‌పై నమోదైన కేసులను త్వరగతిన విచారణ పూర్తి చేయాలని పిటీషనర్ కోరుతున్నారు.


అయితే జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్‌పై విచారణ చేయాలా వద్దా అన్న అంశంపై ఇప్పుడు కోర్టు నిర్ణయం వెల్లడించబోతోంది. ఈనెల 27 ఈ విషయంపై నిర్ణయం వెల్లడిస్తామని కోర్టు చెబుతోంది.  ఒకవేళ కోర్టు ఈ కేసును విచారణకు అర్హమైందిగా  ప్రకటిస్తే మరోసారి జగన్‌కు బ్యాడ్ డేస్ మొదలయ్యాయని చెప్పవచ్చు. ఏ వ్యక్తికైనా బెయిల్ ఇచ్చేటప్పుడు కొన్ని నిబంధనలు విధిస్తారు. అలాంటి నిబంధనలు ఉల్లంఘిస్తే.. ఆ బెయిల్‌ను రద్దు చేసే అధికారం కోర్టులకు ఉంటుంది.

ఇప్పుడు సీఎంగా ఉన్న జగన్ కూడా బెయిల్ నిబంధనలు ఉల్లంఘించారని  ఎంపీ రఘురామ కృష్ణంరాజు చెబుతున్నారు. ఇందుకు ఆయన అనేక ఉదాహరణలు కోర్టు ముందు ఉంచబోతున్నారు. ఆ ఆధారాలపై సీబీఐ కోర్టు సంతృప్తి చెందితే మాత్రం బెయిల్ రద్దయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే ఏపీ రాజకీయాల్లో పెను మార్పులు ఖాయమనే చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: