అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పరిస్థితులు దారుణంగా ఉన్న నేపథ్యంలో అదేవిధంగా ఆక్సిజన్ కూడా అందని నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అలెర్ట్ అవుతుందని చెప్పాలి. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడిన తర్వాత సంచలన నిర్ణయం ప్రకటించే అవకాశాలు ఉండవచ్చు అని అభిప్రాయ పడుతున్నారు. ప్రస్తుతం మన దేశంలో ఆక్సిజన్ కొరత కారణంగా మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి.

ఉత్తరాది రాష్ట్రాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా చాలా ఎక్కువగా ఉంటారు. దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే అక్కడి ప్రజలకు అక్షరాస్యత శాతం కూడా తక్కువ. కాబట్టి కరోనా వస్తే ముందు ఆసుపత్రికి వెళ్లి చికిత్స కోసం ఎదురుచూస్తూ ఉంటారు. కాబట్టి పరిస్థితి దారుణంగా తయారైంది. దక్షిణాది రాష్ట్రాల్లో పరిస్థితులు కాస్త మెరుగ్గా కనపడుతున్నా క్రమంగా ఇక్కడ కూడా కేసులు పెరిగే అవకాశం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఉత్తరప్రదేశ్, బీహార్,  ఢిల్లీలో ఉన్న పరిస్థితుల నేపధ్యంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా కఠిన నిర్ణయం తీసుకోకపోతే మాత్రం ఇబ్బంది పడే అవకాశాలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో కూడా పరిస్థితి క్రమంగా మారుతూ ఉంది. విజయవాడ, విశాఖపట్నం సహా కొన్ని నగరాల్లో ఆక్సిజన్ కొరతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. హైదరాబాదులో కూడా పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. క్రమంగా ఈ పరిస్థితులు ప్రజల ప్రాణాలు తీసే వరకు వెళ్లే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం తీసుకుని ప్రజలను కట్టడి చేయవచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రేపు ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించిన తర్వాత ఆ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని రేపు సాయంత్రం దేశంలో నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది ఏంటి అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: