దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత విషయంలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఆందోళనలో దేశ ప్రజలందరూ కూడా ఉన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుంది ఏంటి అనేది అర్థం కాని పరిస్థితి. అయితే గత కొన్ని రోజులుగా తెలంగాణలో కచ్చితంగా లాక్డౌన్ విధించే అవకాశం ఉందనే ప్రచారం ఎక్కువ జరుగుతున్నది. దీంతో చాలా మంది తెలంగాణ నుంచి వెళ్ళిపోతున్నారు. వలస కార్మికులు అందరూ కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోవడం ఎప్పుడూ కాస్త ఆందోళన కలిగించే అంశంగా ఉంది అని చెప్పుకోవాలి.

అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా చాలామంది ఇతర ప్రాంతాలకు వెళ్లి పోతున్నారు. జార్ఖండ్, బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు మళ్ళీ రవాణా సౌకర్యాలు ఉండవు ఏమో అనే ఆందోళనతో తిరిగి సొంతూళ్లకు వెళ్ళిపోతున్నారు. దీనితో బస్టాండ్లు రైల్వేస్టేషన్లు అన్ని కూడా కిటకిటలాడుతున్నాయి. దీనివల్ల కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. కేంద్ర ప్రభుత్వం అత్యున్నత స్థాయి సమీక్షను నేడు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఏ నిర్ణయం ప్రధానమంత్రి ప్రకటిస్తారు ఏంటనే దానిపై అర్థంకాని పరిస్థితి.

దేశ వ్యాప్తంగా కూడా కరోనా తీవ్రత పెరిగిపోవడంతో కేంద్ర ప్రభుత్వంఅన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు తో మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయాన్ని వెల్లడించే అవకాశాలు ఉండవచ్చు అని అందరూ భావిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి స్పష్టత కూడా రావడం లేదు. త్వరలోనే దీనిపై క్లారిటీ ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లో పరిస్థితి దారుణంగానే ఉంది. ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రజలు ఎవరూ కూడా బయటకు రావడానికి సాహసించడం లేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలు తమ ఆక్సిజన్ ని తామే వాడుకోవాలని నిర్ణయం తీసుకున్నాయి. మిగిలిన రాష్ట్రాలు కూడా ఇదే విధంగా నిర్ణయం తీసుకుంటే ఈశాన్య రాష్ట్రాలు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: