ప్రపంచమంతా కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ వల్ల నానా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముస్లిం లు సంతోషం గా చేసుకొనే రంజాన్ ను ఘనంగా చేసుకునే పరిస్థితి కూడా లేదు. అయితే, అత్యాచార ఆరోపణలు ఎదుర్కొన్న వివాదాస్పద స్వామిజీ నిత్యానందం మాత్రం తరచూ ఏదో ఒక చర్య తో వార్తల్లో నిలుస్తున్నారు. కైలాస అనేది నిత్యానంద ప్రపంచం. దానికి తనని తాను ప్రధానిగా ప్రకటించుకున్నారు. ఇటీవల కైలాస డాలర్‌ను కూడా తీసుకొచ్చారు. ఇందుకోసం గతంలో ‘రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్ కైలాస’ను ప్రారంభించినట్లు తెలుసు.


అనేక ఆరోపణల మీద 50 సార్లు కోర్టుకు హాజరైన నిత్యానంద.. గతేడాది నవంబరు లో భారత్‌ వదలి పారిపోయిన సంగతి తెలిసిందే. అయితే, ఆయన ఎక్కడ ఉంటున్నారనే విషయం మాత్రం తెలియదు. ఈక్వెడార్‌కు సమీపం లోని ఓ ద్వీపం లో ఆయన నివాసం ఉంటున్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి.  ఇది ఇలా ఉండగా ఇప్పుడు మరో సారి సంచలన ప్రకటన చేశారు. తన ఆధీనం లోని ‘కైలాస’ ద్వీపానికి భారతీయు లకు అనుమతిని నిరాకరిస్తూ ఆదేశాలివ్వడమే అందుకు కారణం. భారత్‌, బ్రెజిల్, ఐరోపా సంఘం, మలేసియా దేశాల నుంచి రాకపోక లపై నిషేధం విధిస్తున్నట్లు తన ప్రెసిడెన్షియల్ మ్యాండేట్ ‌లో ప్రకటించారు..


పలు దేశాల్లో కరోనా విజృంభిస్తోన్న తరుణంలో.. తన దేశాన్ని రక్షించుకునేందుకు సోషల్ మీడియా వేదికగా వేదికగా ఈ ప్రకటన చేశారు.. ఇకపోతే 2019లో ఈ స్వామీజీ రాసలీలల వీడియో బయట పడటంతో భారత్‌ను వదిలిపారిపోయారు. అప్పటినుంచి ఈక్వెడార్ సమీపం లోని ఓ ద్వీపంలో నివాసం ఉంటున్నట్లు పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ఈక్వెడార్ మాత్రం ఆ వార్తలను తోసిపుచ్చింది. కాగా, నిత్యానంద తాను ఉంటున్న ద్వీపాన్ని ‘కైలాస’ అని చెప్తుండటం తో పాటు, దానికి అధినేతగానూ ప్రకటించుకున్నారు. ఇప్పుడు తన ద్వీపానికి రావొద్దని ప్రకటించడం అందరినీ ఆలోచనలో పడేసింది..

మరింత సమాచారం తెలుసుకోండి: