టీడీపీ నేతలు ఇప్పుడు ఏది మాట్లాడినా సరే అరెస్ట్ చేసే పరిస్థితి ఉంది అనే మాట వాస్తవం. తాజాగా టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ళ నరేంద్ర ను అరెస్ట్ చేయడంపై... చంద్రబాబు నాయుడు ఫైర్ అయ్యారు. సంగం డైరీని దెబ్బతీసి అమూల్ కు కట్టబెట్టే కుట్రలో భాగంగానే narendra KUMAR' target='_blank' title='ధూళిపాళ్ల నరేంద్ర-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ధూళిపాళ్ల నరేంద్ర అక్రమ అరెస్ట్ అని ఆయన ఆరోపించారు. narendra KUMAR' target='_blank' title='ధూళిపాళ్ల నరేంద్ర-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ధూళిపాళ్ల నరేంద్ర అక్రమ అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నా అన్నారు. స్థానిక రైతులు భాగస్వామిగా ఉండే సంగం డైరీని నిర్వీర్యం చేసి గుజరాత్ కు చెందిన అమూల్ కు కట్టబెట్టే ప్రయత్నంలో భాగంగానే అక్రమ కేసు పెట్టారని అన్నారు.

పొరుగు రాష్ట్రానికి చెందిన అమూల్ తో లోపాయికారీ ఒప్పందాలు చేసుకుని ఇక్కడి సంస్థలను దెబ్బతీస్తున్నారు అని విమర్శలు చేసారు. రెండేళ్ల పాలనలో అభివృద్ధి లేదు కానీ.. అక్రమ అరెస్ట్ లు మాత్రం ఉంటున్నాయి అన్నారు. ప్రజా సమస్యలు బయటకు వచ్చిన ప్రతిసారి టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తూ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారు అని అన్నారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమామహేశ్వరరావు వంటి నేతలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు అని మండిపడ్డారు.

కరోనా నియంత్రణలో విఫలమవడంతో ప్రజలను పక్కదారి పట్టించడానికే టీడీపీ నేతలపై కక్షసాధింపు చర్యలకు దిగారని అన్నారు. ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని అక్రమ అరెస్ట్ లు చేయించుకుంటూ పోతే రాష్ట్రంలో ఎవరూ మిగలరని జగన్ రెడ్డి గుర్తించాలి అని సూచించారు. ధూళిపాళ్ళ నరేంద్రను తక్షణమే విడుదల చేయాలి అని డిమాండ్ చేసారు. మాజీ మంత్రి reddy SOMIREDDY' target='_blank' title='సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా స్పందించారు. నరేంద్ర తండ్రి వీరయ్య చౌదరి నుంచి వారి కుటుంబం హుందా రాజకీయాలకు మారుపేరు అని అన్నారు. సంఘం డెయిరీని పాడి రైతులకు తిరుగులేని ఆస్థిగా తీర్చిదిద్దిన ఘనత వారిది అన్నారు. నరేంద్రపై అక్రమ కేసు బనాయించి అరెస్ట్ చేయడం దుర్మార్గం అని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ కక్షసాధింపులు హద్దు మీరిపోయాయి..తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అని హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: