పవన్ కళ్యాణ్ బీజేపీ తో పొత్తు పెట్టుకోవడం కరెక్ట్ కాదని ప్రకాష్ రాజ్ విమర్శించారు. ఇటీవల విడుదలైన వకీల్ సాబ్ సినిమాలో ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నందా పాత్ర‌లో లాయ‌ర్ గా న‌టించి ప్ర‌కాష్ రాజ్ ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు. అయితే సినిమా విడుదల తరవాత ప్రకాష్ రాజ్ ఓ ఇంటర్వ్యూ లో పవన్ కళ్యాణ్ అంటే తనకు చాలా ఇష్టమని అన్నారు. సుస్వాగతం టైమ్ లో పవన్ సిగ్గుపడేవారని కానీ ఇప్పుడు ఆయన వ్యక్తిత్వం లో మార్పు వచ్చిందని అన్నారు. పవన్ ఎంతో సింపుల్ వ్యక్తి..ప్రజల పట్ల ఎంతో ప్రేమ ఉందన్నారు. అయితే తాజగా మాత్రం పవన్ బీజేపీ దోస్తీ పై ప్రకాష్ రాజ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడానికి బీజేపీ ఎవరని ప్రశ్నించారు. తాను సీఎం అభ్యర్థిని అని పవన్ నేరుగా ముందుకు వచ్చి భావజాలాన్ని బహిర్గతం చేయాలన్నారు. 

ప్రజల్లో తానేంటో నిరూపించుకోవాలని...ఫోకస్ అవ్వాలని పేర్కొన్నారు. అంతే కాకుండా బీజేపీ తో పొత్తు అసలు కరెక్ట్ కాదని విమర్శించారు. ఇదిలా ఉండగా   ఏపీలో జనసేన బీజేపీ పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల్లో జనసేన బీజేపీ కలిసి పోటీ చేసాయి. అయితే ఎన్నికల ప్రచారం లో భాగంగా పవన్ కళ్యాణ్ తమ ఉమ్మడి ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమురి వీర్రారు వ్యాఖ్యానించారు. 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తమ ఉమ్మడి సీఎం అభ్యర్థిగా ఉంటారని ప్రకటించారు. అప్పట్లో ఈ వార్త సెన్సేషనల్ అయ్యింది. సోమూ వ్యాఖ్యలపై ఇతర పార్టీలు కూడా విమర్శలు కురిపించాయి. ఇక తాజాగా ప్రకాష్ రాజ్ కూడా దాన్ని తప్పు పడుతూ హాట్ కామెంట చేశారు .

మరింత సమాచారం తెలుసుకోండి: