రాజకీయాలకు కాదేదీ అనర్హం అన్న ముతక సామెత ఉంది. ఒకరు ఎడ్డేమంటే తెడ్డేమని బదులు ఇవ్వడమూ రాజకీయ జీవులకు అలవాటే. ఇపుడు ఏపీలో ఏ చిన్న విషయం అయినా సరే రాజకీయాల రొచ్చులో చిక్కుకుని విలవిలలాడుతోంది.

ఏపీలో పదవ తరగతి, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం గట్టిగానే చెబుతోంది. ఒక వైపు కరోనా కేసులు ఉంటే ఎలా నిర్వహిస్తారు ఠాట్ అసలు పరీక్షలు పెట్టడానికి లేదు అంటోంది విపక్షం. ఈ విషయంలో మొదట గద్దించింది టీడీపీ నేత లోకేష్. ఆయన తరువాత జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ఒక లేఖ రాసి పరీక్షలు ఈ సమయంలోనా అంటూ వైసీపీ మీద విమర్శలు ఘాటుగానే చేశారు.

ఇక బీజేపీ సహా అన్ని పార్టీలూ ఇదే అంశాన్ని పట్టుకున్నాయి. మొత్తానికి చూస్తే ప్రభుత్వానికి ఇపుడు ఇది అత్యంత ప్రతిష్టాత్మకం అయింది. దాంతో ఇపుడు కనుక పరీక్షలు వాయిదా వేసినా రద్దు చేసినా కూడా ఈ మొత్తం క్రెడిట్ విపక్షాలకు పోతుంది అన్న దూరాలోచనలో ప్రభుత్వ పెద్దలు ఉన్నారు. ఏపీలో చూస్తే కరోనా విలయతాండవం చేస్తోంది. అదే సమయంలో మే 5 నుంచి ఇంటర్ పరీక్షలు అంటోంది ప్రభుత్వం.

ఈ పరిణామాలతో విద్యార్ధులు వారి తల్లిదండ్రులు హడలిపోతున్నారు. దేశమంతా టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేసి పారేసింది. కానీ ఒక్క ఏపీలో మాత్రమే వాటిని నిర్వహిస్తామని చెబుతోంది. అయితే కరోనా కేసులు ఉంటే ప్రభుత్వం కూడా పరీక్షలు నిర్వహించలేదు. ఆ సంగతి తెలిసిందే. అయితే పరీక్షలు వాయిదా అని ప్రభుత్వం అంటే ఎక్కడ తమ విజయంగా విపక్షాలు క్లెయిం చేసుకుంటాయో అన్న ఆలోచనతోనే సర్కార్ మొండిగా ముందుకు సాగుతోంది. మొత్తానికి చూస్తే అటూ ఇటూ రాజకీయమే అంతా చేస్తున్నారు. వీరి రాజకీయాల‌ మధ్యన విద్యార్హులకు, వారి తల్లిదండ్రులకు హై బీపీని తెప్పించేస్తున్నారు అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.




మరింత సమాచారం తెలుసుకోండి: