దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఈ విషయంలో రెండవ మాట లేదు. ఏ రాష్ట్రం చూసినా కూడా పెరుగుతున్న నంబర్లతో వణుకుతోంది. ఈ నేపధ్యంలో కరోనాను ఎదుర్కోవాలంటే అన్ని ఆయుధాలు సమకూర్చుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది.

ఇక  రాష్ట్రాల  విషయం తీసుకుంటే గత ఏడాది కరోనా షాక్ తోనే పూర్తిగా చితికిపోయాయి. ఇపుడిపుడే కోలుకుంటున్న దశలో పెద్ద ఎత్తున అలజడి రేపుతూ సెకండ్ వేవ్ కూడా వచ్చేసింది. దాంతో కరోనా కట్టడి కి రాష్ట్రాలు అష్టకష్టాలు పడుతున్నాయి ఇదిలా ఉంటే కేంద్రం గత ఏడాది కరోనా వేళ ఎంతగానో సాయం చేసింది. అన్ని విధాలుగా ఆదుకుంది. కేంద్రం నేరుగా రంగంలోకి దిగి డైరెక్షన్ కూడా ఇచ్చింది. ప్రతీ రెండు వారాలకు ఒకసారి మోడీ దేశంలోని ముఖ్యమంత్రులు అందరితోనూ మీటింగులు పెట్టి మరీ పరిస్థితిని మోనిటరింగ్ చేసేవారు. అలాగే ఆర్ధికంగా కూడా కేంద్రం దన్నుగా నిలిచింది.

కానీ ఇపుడు చూస్తే కేంద్రం ఆ స్పీడ్ తగ్గించేసింది. పైగా రాష్ట్రలా మీదనే పెను భారం కూడా పెడుతోంది. దేశంలో 18 నుంచి 45 ఏళ్ల వయసు వారు హెచ్చు సంఖ్యలో ఉన్నారు. వారందరికీ టీకాలు వేసే బాధ్యతను రాష్ట్రాల మీదకే కేంద్రం వదిలేసింది. దీని మీద కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కూడా మోడీకి లేఖ రాశారు. ఈ వివక్ష పనికిరాదు అని కూడా అన్నారు. అయితే ఇపుడు రాష్ట్రాలు తమ మీద పెరుగుతున్న ఆర్ధిక భారం తట్టుకోలేక కరుణించు మోడీ అని ఢిల్లీని శరణు కోరుతున్నారు. గత ఏడాది మాదిరిగానే కేంద్రం చొరవ చూపి ఆదుకొవాలని కూడా కోరుతున్నారు. మరి ఈ విషయంలో మోడీ సర్కార్ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. కేంద్రం కనుక పట్టించుకోకపోతే రాష్ట్రాలు మరింతగా ఇబ్బందుల్లో పడడం ఖాయమని అంటున్నారు. చూడాలి మరి మోడీ దయ ఏ విధంగా ఉంటుందో.




మరింత సమాచారం తెలుసుకోండి: