ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అవినీతి ఎంత మాత్రం కూడా సహించే ప్రసక్తే లేదని అవినీతి ఎవరు చేసినా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పారు. అందులో భాగంగానే టిడిపి నేతలు అవినీతి చేసిన లేకపోతే ఎవరు అవినీతి చేసిన సరే వాళ్ళని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఆసుపత్రిల విషయానికి వస్తే కరోనా కారణంగా భారీగా ఫీజులు వసూలు చేస్తున్నారు అనే ఆరోపణలు ఎక్కువగా వినబడుతున్నాయి. దీనితో కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు మీద రాష్ట్ర ప్రభుత్వం కన్నేసింది.

విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, చిత్తూరు నెల్లూరు సహా కొన్ని ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం సోదాలు కూడా చేస్తుంది. రోగుల వద్ద నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని ఎంతమాత్రం కూడా ఉపేక్షించేది లేదని వైద్య శాఖ అధికారులు కూడా స్పష్టంగా చెబుతూ సోదాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు లంచాలు తీసుకుని ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించే వాళ్ళ కంటే కూడా నిజాయితీగా వైద్యం చేసే వాళ్ళని ఇబ్బందిపెట్టడం తో చాలామంది ప్రైవేటు ఆసుపత్రులలో రోగులను ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు.

ఎక్కడ తమను ఇబ్బంది పెడతారో అని భావించిన చాలా ప్రైవేటు ఆసుపత్రులు చాలా మందిని జాయిన్ చేసుకోవడం లేదు. దీని కారణంగా కరోనా కేసులు భారీగా పెరిగే అవకాశం ఉందని వైద్యం అందక చాలామంది మరణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఏది సత్యం ఏది అసత్యం అనేది జగన్ తెలుసుకోవాలని అప్పుడే ఆసుపత్రుల విషయంలో కఠినంగా ముందుకు వెళ్లాలని కొంతమంది కోరుతున్నారు. ఇదే విధంగా ముందుకు వెళితే భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం పై అభిప్రాయం మారే అవకాశాలు ఉంటాయని కూడా కొంతమంది హెచ్చరిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఏపీలో అసలే బెడ్ ల కొరత చాలా తీవ్రంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: