ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ ఏది చేసినా సరే కక్షసాధింపు గానే ఉంటుంది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా అధికార పార్టీ నేతలు కొంతమంది ని టార్గెట్ గా చేసుకుని ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం చేస్తున్నారు.  టీడీపీ నేతలు ఏది చేసినా సరే అందులో తప్పులు వెతుకుతూ వాళ్ళను ఇబ్బంది పెట్టే ప్రయత్నం అధికార పార్టీ నేతలు చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి వైయస్ జగన్ నుంచి ఎమ్మెల్యేల వరకు దాదాపు ఇదే పరిస్థితి ఉంది. పోలీసులు కూడా పూర్తిస్థాయిలో సహకరించడంతో టీడీపీ నేతలపై కేసులకు అర్థం పర్థం ఉండటం లేదు అనే ఆవేదన కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల  నరేంద్ర పై కేసు నమోదు చేశారు. ఈ కేసు విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఆయనకు నోటీసులు ఇచ్చిన విధానం ఒక పద్ధతి ప్రకారం లేదని ముందు ఆయనను అదుపులోకి తీసుకున్న తర్వాత ఏసీబీ అధికారులు సోదాలు చేసి తర్వాత కుటుంబానికి నోటీసు ఇవ్వడం వల్ల కుటుంబానికి నోటీసులు ఇచ్చారని అంటున్నారు.  ఉదయం ఇచ్చిన నోటీసు తర్వాత ఇచ్చిన నోటీసులో రకరకాలుగా ఉండటంతో అందరూ కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

ఇది కక్షపూరిత రాజకీయాలు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన కేసులు నిలబడటం లేదు అనే అభిప్రాయం కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు.  టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వ్యవహారంలో కూడా ఇదే జరిగింది. అలాగే కొల్లు రవీంద్ర వ్యవహారంలో కూడా దాదాపు ఇలాగే జరిగింది. ఇప్పుడు నరేంద్ర గృహంలో కూడా ఇలాగే జరగడంతో చాలా మంది విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పెట్టే కేసులకు ఒక పద్ధతి ఉంటే న్యాయస్థానాలు కూడా కేసుల విషయంలో సీరియస్ గా దృష్టి సారించే అవకాశం ఉంటుందని బెయిల్ కూడా త్వరగా వచ్చే అవసరం అవకాశం ఉండదని కాబట్టి జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: