ఆంధ్రప్రదేశ్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. కృష్ణా గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కూడా కొన్ని చోట్ల పడ్డాయి. కొన్ని చోట్ల గాలి దుమ్ము చుక్కలు చూపించింది. దీనితో ప్రజలు బాగా ఇబ్బంది పడ్డారు. గుంటూరు జిల్లాలో అకాల వర్షాలతో కొన్ని చోట్ల పరిస్థితి దారుణంగా మారింది. మరికొన్ని చోట్ల పంట పొలాలు కొంత మేర దెబ్బ తిన్నాయి. ఇక పిడుగుపాటు హెచ్చరికలు కూడా కొన్ని చోట్ల చేసారు. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, చిత్తూరు, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాలకు పిడుగు హెచ్చరిక చేసారు విపత్తుల శాఖ కమీషనర్ కన్నబాబు.

ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురం, బేస్తవారిపేట, వెలిగండ్ల, కనిగిరి, హనుమంతునిపాడు, కొనకనమిట్ల, మర్రిపూడి, పొదిలి, గిద్దలూరు, చీమకుర్తి లో పిడుగు పడే అవకాశం ఉందని హెచ్చరించారు. నెల్లూరు జిల్లాలో నెల్లరు, సీతారామపురం, వరికుంటపాడు, ఉదయగిరి, దుత్తలూరు, మర్రిపాడు, అనంతసాగరం, ఆత్మకూరు, చేజర్ల, పొదలకూర్, దగదర్తి, అనుమసముద్రంపేట, కలిగిరి, సంగం, కొడవలూరులో పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపారు. కర్నూలు జిల్లా కర్నూలు, నందికోట్కూరు, కల్లూరు, పగిడ్యాల, జూపాడుబంగ్లా, మిడ్తూరు, ఓర్వకల్లు, గడివేముల, దేవనకొండ, సి.బేళగల్, కొత్తపల్లె, వెల్దుర్తిలో పిడుగు పడే అవకాశం ఉందని తెలిపారు.

చిత్తూరు జిల్లాలో శాంతిపురం, రామకుప్పం, వెంకటగిరికోట, బైరెడ్డిపల్లె, పలమనేరు, బంగారుపాలెం, గంగవరం, సోమల, విజయనగరం జిల్లా, మెరకముడిదం, గరివిడి, చీపురుపల్లి, గుర్ల, తేర్లాం, బాడంగి, దత్తిరాజేరు, నెల్లిమర్ల, బొందపల్లి, బొబ్బిలి, శ్రీకాకుళం జిల్లా, శ్రీకాకుళం, గంగువారి సిగడాం , రాజాం, సంతకవిటి, రేగడిఆముదాలవలస, ఎచ్చెర్ల, రంగస్థలం, బూర్జ లో పడే అవకాశం ఉందని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా చింతూరు, వరరామచంద్రాపురం, మారేడుమిల్లి, వై.రామవరం మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు ఉధృతంగా పడే అవకాశం ఉంది అని తెలిపారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకండి అని సూచించారు.  సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందండి అని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: