కరోనా కట్టడి పై సీఎం వైఎస్ జగన్ మంత్రివర్గం తో విస్తృతంగా చర్చించారు అని మంత్రి ఆళ్ళ నానీ అన్నారు. వాక్సినేషన్  కార్యక్రమాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాలని నిర్ణయం తీసుకున్నాం అని ఆయన వెల్లడించారు. 18- 45ఏళ్ల వారికి ఉచితంగా వాక్సినేషన్  ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. 2 కోట్ల మందికి పైగా వాక్సిన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని ఆయన ప్రకటించారు. వాక్సినేషన్ కోసం 1600 కోట్లు వెచ్చించాలని సీఎం నిర్ణయించారు అని అన్నారు. రేపట్నుంచి రాత్రి 10-5 గంటల వరకు నైట్ కర్ప్యూ విధించాలని సీఎం నిర్ణయించారు అని తెలిపారు.

సీటీ స్కాన్ కు ధరలు నిర్ణయించాలని సీఎం  ఆదేశించారు అని ఆయన తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రులు అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు అని ఆయన చెప్పుకొచ్చారు. ప్రజలు మాస్కులు తప్పనిసరిగా ధరించాలి అని ఆయన స్పష్టం చేసారు.  ప్రజలు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి అని సూచించారు. పది, ఇంటర్ పరీక్షల రద్దుపై  ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అని ఆయన చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ఆస్పత్రుల్లో  బెడ్స్ పెంచాలని సీఎం  ఆదేశించారు అని ఆయన వెల్లడించారు.

ఏపీలో 18-45 మధ్య వయసువారు 2,04,70,364 మంది ఉన్నారని ఆయన అన్నారు. ఏపీలో రేపటి నుంచి నైట్‌ కర్ఫ్యూ విధిస్తామని ఆయన చెప్పారు. ఏపీలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలు అవుతుంది అన్నారు. ఏపీలో ఇప్పటికే 45 ఏళ్లు పైబడిన వారికి ఉచితంగా వ్యాక్సిన్‌ అందిస్తామని తెలిపారు. ఉచిత వ్యాక్సిన్‌ కోసం 1600 కోట్లు ఖర్చు అవుతుంది అని ఆయన చెప్పుకొచ్చారు. వైద్య పరీక్షలకు అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని నేడు మీడియా తో మాట్లాడుతూ వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: