కరోనాతో దేశం అల్లాడిపోతోంది. అన్ని రాష్ట్రాల్లోనూ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ మహ్మమారి పంజా విసురుతోంది. తెలంగాణలో రికార్డ్ స్థాయిలో కేసులు , మరణాలు సంభవిస్తున్నాయి. పల్లె, పట్నం తేడా లేకుండా అంతటా వైరస్ విజృంభిస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ కరోనా రోగులు పెరిగిపోయారు. ఈ నేపథ్యంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కరోనా బాధితులకు ధైర్యం నూరిపోసే ప్రయత్నం చేశారు.

తన సొంత నియోజకవర్గం పాలకుర్తి పరిధిలోని పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల, పెద్దవంగర, తొర్రూరు, రాయపర్తి మండలాల్లోని కరోనా బాధితులు, వారి కుటుంబ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, అధికారులతో మంత్రి ఎర్రబెల్లి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో నియోజకవర్గ వ్యాప్తంగా ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఆర్డీవోలు, ఎమ్మార్వో లు, సీఐ లు, ఎస్సైలు, డీఎంఅండ్ హెచ్ఓ, డాక్టర్లను టెలీకాన్ఫరెన్సులోకి తీసుకుని మంత్రి వారితో మాట్లాడారు. కరోనా రోగులు కొందరు మంత్రి తోనూ మాట్లాడారు. వారి యోగ క్షేమాలను, అందుతున్న వైద్యాన్ని, తీసుకుంటున్న జాగ్రత్తలను మంత్రి ఎర్రబెల్లితో పంచుకున్నారు.

కొంచెం ధైర్యంగా ఉందాం. మీకు అన్ని విధాలుగా అండగా నేను ఉంటాను. మరీ ఇబ్బందులు అనిపిస్తే, నాకు గానీ, నా వద్ద పని చేసే సిబ్బందికి గానీ ఫోన్ చేయండి. అంటూ రోగులకు భరోసా ఇచ్చారు దయాకర్ రావు, ఒకవైపు కరోనా బాధితుల స్థితిగతులను తెలుసుకుంటూనే, మరోవైపు ప్రజాప్రతినిధులు తిండికి ఇబ్బంది ఉన్నవాళ్లకు సపోర్ట్ చెయాలని సూచించారు. ఒకవైపు బాధితులకు  భరోసాని, ధైర్యాన్నినింపుతూ మరోవైపు ప్రజాప్రతినిధులు వారి అదుకోవాలని చెపుతూ వారితో  మంత్రి మాట్లాడారు.

మరోవైపు కరోనా పరిస్థితులపై తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన వివరణ పట్ల హైకోర్టు అసహనం ప్రదర్శించింది. పగటివేళ బహిరంగ ప్రదేశాల్లోనూ, థియేటర్లు, బార్లు వద్ద ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. కుంభమేళా నుంచి వచ్చినవారిని పలు రాష్ట్రాలు క్వారంటైన్ లో ఉంచుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది? అని ప్రశ్నించింది. పొరుగు రాష్ట్రాలతో సరిహద్దుల వద్ద తీసుకుంటున్న చర్యలపై వివరించాలని పేర్కొంది. ఆర్టీపీసీఆర్ టెస్టుల రిపోర్టులు 24 గంటల్లో ఎందుకు ఇవ్వడంలేదు? వీఐపీల కరోనా పరీక్షల ఫలితాలు కు 24 గంటల్లోనే ఎలా వస్తున్నాయని అసంతృప్తి వ్యక్తం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: