కరోనా మహమ్మారి రోజు రోజుకి తన పంజా విసురుతుంది.దేశమంతటా అల్లకల్లోలం సృష్టిస్తున్నది.కరోనా సునామీల ముంచుకోస్తుంది. రోజు రోజుకు కరోనా వైరస్ కేసులు చాలా దారుణంగా రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి.ఈ కరోనా వైరస్ రోజు రోజుకి చాప కింద నీరు లాగా ప్రపంచం అంతా వ్యాపిస్తుంది.ప్రపంచ దేశాలని వణికిస్తుంది.ఏం చెయ్యాలో ఎలా అదుపు చెయ్యాలో తెలీక వివిధ దేశాల ప్రభుత్వం అధికారులు అలాగే వైద్య అధికారులు తలలు పట్టుకుంటున్నారు.ఇక మనదేశంలో కూడా ఈ కరోనా కేసులు లక్షల్లో నమోదవుతున్నాయి. రోజు రోజుకి చాలా ఎక్కువవుతున్నాయి.రోజూవారీ కొత్త కేసుల సంఖ్య ఏకంగా మూడు లక్షల మార్కును కూడా దాటింది. గత రెండు రోజుల నుంచి వరుసగా మూడు లక్షలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఒక పక్క చాలా మంది ప్రజలు కరోనా సోకి అల్లాడుతుంటే మరో పక్క ఈ కరోనా టైములో పనులు లేక పేద ప్రజలు ఆకలితో అల్లాడిపోతున్నారు.గతంలో కూడా కరోనా టైంలో చాలా పేద వాళ్ళు ఎన్నో అవస్థలు పడ్డారు.


ముఖ్యంగా వలస కూలీలు అయితే చాలా అవస్థలు పడ్డారు.వాళ్లకి జీవనోపాదికి పనులు లేక తినటానికి తిండి లేక పేద వలస కూలీలు కాని మధ్య తరగతి కుటుంబాలు కాని ఎన్నో అవస్థలు పడ్డారు.అయితే అలా బాధ పడే పేద ప్రజలకు కేంద్రం నుంచి తీపి కబురు అందింది.ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద మే, జూన్ నెలల్లో ఉచితంగా ఆహార ధాన్యాలను సమకూర్చనున్నట్లు కేంద్ర సర్కారు తెలిపింది. ఒక్కో లబ్ధిదారుకు 5 కిలోల చొప్పున ఆహార ధాన్యాలను అందించనున్నట్లు వెల్లడించింది. ఈ పథకం ద్వారా మొత్తం 80 కోట్ల మందికి లబ్ధి చేకూరనుందని, దీని కోసం తాము రూ.26 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని కేంద్రం ప్రకటించింది.నిజంగా ఈ సమయంలో ఇది ప్రజలకు మంచి వార్తే అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: