గత ఏడాది ఇదే సమయంలో కరోనా వైరస్ వెలుగులోకి వచ్చి అందరిలో ప్రాణ భయం కలిగించింది. అయితే ఈ మహమ్మారి వైరస్ గురించి ఎలాంటి అవగాహన లేక పోయినప్పటికీ కూడా ప్రజలు అందరూ భయంతో తగిన జాగ్రత్తలు పాటించి ఇక వైరస్ బారిన పడకుండా ఉన్నారు.  ఈ క్రమంలో 130 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో అతి తక్కువ కేసులు నమోదయ్యాయి ఆ తర్వాత ప్రజలందరూ కరోనా వైరస్ పై అవగాహన వచ్చింది. కరోనా వైరస్ బారిన పడకుండా ఉండేందుకు ఏం చేయాలి అనే దానిపై అటు అందరికీ అన్ని విషయాలు తెలుసు. ఈ క్రమంలోనే ఎంతోమంది తగిన జాగ్రత్తలు పాటిస్తున్నారు.


 అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కేసుల సంఖ్య దేశంలో అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో దేనివల్ల కరోనా వైరస్ వ్యాప్తి శరవేగంగా జరుగుతోంది అనే దానిపై కూడా కనుగొనేందుకు అధికారులు సిద్ధమయ్యారు ఈ క్రమంలోనే ఎంతోమంది కరోనా వైరస్ పై నిర్లక్ష్యంగా వ్యవహరించడం కారణంగానే దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నట్లు తెలుస్తుంది అయితే ఒకప్పుడు కరోనా వైరస్ సోకిన తర్వాత నేరుగా ఆస్పత్రికి తీసుకు వెళ్ళేవారు కానీ ప్రస్తుతం  వైరస్ సోకితే హోమ్ క్వారం టైన్ లో   ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.



 ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఎంతోమంది ఇక  వైరస్ బారిన పడిన తర్వాత ఇంట్లోనే ఉండకుండా ఆరు బయటకు వెళ్లడం వివిధ రకాల ప్రయాణాలు చేస్తూ ఉండటం తమకు కావాల్సిన వస్తువులను నేరుగా వెళ్లి తెచ్చుకోవడం కారణంగా ఇక వారి ద్వారా ఎంతో మందికి కూడా వైరస్ సోకుతుంది అంటూ చెబుతున్నారు వైద్యనిపుణులు. కానీ ఎంతోమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వైరస్ వ్యాప్తికి కారకులని మారిపోతున్నారు. అయితే వైరస్ సోకిన వారిని ట్రాక్ చేసే సౌకర్యం లేకపోతే ఇక ఇలా ప్రజలందరూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అని చెబుతున్నారు వైద్యనిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: