గత కొన్ని రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మొగిస్తుంది. మొన్నటి వరకు అతి తక్కువగా ఉన్న కేసులు ప్రస్తుతం భారీ సంఖ్యలో పెరిగిపోతూనే ఉన్నాయి.  ఈ క్రమంలోనే అటు రాష్ట్ర ప్రజలందరూ బెంబేలెత్తిపోతున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ ను కంట్రోల్ చేసేందుకు మళ్లీ కఠిన ఆంక్షలు అమలులోకి తీసుకు వస్తుంది. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని  భౌతిక దూరం పాటించాలి అంటూ ఇప్పటికే కొన్ని రకాల ఆంక్షలను తెరమీదికి తెచ్చింది ప్రభుత్వం. అంతేకాకుండా రాత్రి  సమయంలో కర్ఫ్యు విదిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే  పోలీస్ అధికారులు మరోసారి రంగంలోకి దిగి  వైరస్ కట్టడికి సిద్ధమయ్యారు




 గత ఏడాది ఇదే సమయంలో లాక్ డౌన్ అమలు లోకి రాగా ఎంతో మంది పోలీసు అధికారులు తమ ప్రాణాలను పణంగా పెట్టి మరి  వైరస్ కంట్రోల్ చేయడంలో కీలక పాత్ర పోషించారు ఇక మరో సారి ఇప్పుడు వైరస్ నియంత్రించడానికి సిద్ధమవుతున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే ఎంతో మంది పోలీసు అధికారులు సైతం  వైరస్ బారిన పడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవలే రాచకొండ కమిషనరేట్ పరిధిలో భారీ సంఖ్యలో పోలీసులు  వైరస్ బారిన పడినట్లు సి పి మహేష్ భగవత్ చెప్పుకొచ్చారు.



 కరోనా  సెకండ్ వేవ్ లో భాగంగా కేవలం రాచకొండ కమిషనరేట్ పరిధిలోని 225 మంది పోలీసులు కరోనా వైరస్ బారిన పడినట్లు ఇటీవలే ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తమ కమిషనరేట్ పరిధిలో 95 శాతం మందికి వాక్సినేషన్ ప్రక్రియ పూర్తయిందని మిగతా అర్హులైన వారందరికీ కూడా వ్యాక్సిన్ అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని సీపీ మహేష్ భగవత్ చెప్పుకొచ్చారు ఇక వైరస్ బారిన పడిన వారిలో ఆత్మస్థైర్యం నింపేందుకు జూమ్ ద్వారా అందరితో మాట్లాడుతున్నమని..  వారికి కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ తో పాటు వారి అకౌంట్ లో 5 వేలు రూపాయలు కూడా జమ చేస్తున్నంటూ చెప్పుకొచ్చారు మహేష్ భగవత్.

మరింత సమాచారం తెలుసుకోండి: