కరోనా వైరస్ కంటికి కనబడకుండా ఖండాంతరాలకు వ్యాపిస్తోంది. అంతే కాదు, నిండు జీవితాలను ఖతం చేస్తోంది. కరోనా పేరు వింటేనే హడలిపోతున్న దయనీయం సామాన్యులది. మొదటి దశకే కునారిల్లిన పరిస్థితిలో రెండవ దశ దూకుడు చూస్తే ముచ్చెమటలే పడుతున్నాయి.

సరే ఇది జనం బాధ అని కొట్టిపారేయాల్సినది కాదు, జనంతో కనెక్ట్ అయి ఉన్న ప్రజా నాయకులదీ ఇదే బాధ. గత ఏడాది కరోనా విషయంలో కేంద్రం సహకారం బాగా అందించింది. దాంతో అనేక రాష్ట్రాలు కూడా చాలా జోరు చేశాయి. కరోనా సహాయాన్ని కూడా ప్రకటించి బాధితులకు అండగా నిలబడ్డాయి. కానీ రెండవ దశలో మాత్రం కేంద్రం మునుపటి స్పీడ్ కనబర‌చడంలేదని విమర్శలు ఉన్నాయి. దాంతో కొన్ని చోట్ల రాష్ట్రాలు కూడా అదే తీరున సాగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి.

కరోనా అంటే ఒక వైపు ఉన్న ఆదాయాలు కోల్పోవడం, మరీ వైపు కొత్తగా బోలెడు ఖర్చు చేయాల్సి రావడం. దాంతో అంతంతమాత్రంగా ఆర్ధిక పరిస్థితి ఉన్న రాష్ట్రాలు తట్టుకోలేకపోతున్నాయి. చూడబోతే రెండవ దశ దారుణంగా ఉంది. వేగం ఎక్కువగా ఉంది. దాంతో గతం కంటే కూడా కేసులు పెద్ద సంఖ్యలో పెరుగుతున్నాయి. అయినా పాలకులు చేతులు గట్టిగా విదిలించలేకపోతున్నారు. ఈ పరిణామాలతో జనాల్లో కూడా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.

కరోనా వేళ జనాలు పెడుతున్న గోడు పట్టని పాలకులకు రానున్న రోజులలో యమ గండమే అంటున్నారు. కరోనా విషయంలో ముందస్తు చర్యలు తీసుకుంటేనే రాజకీయంగా ఇబ్బందులు తప్పుతాయి అని అంటున్నారు. ఏమైనా తేడా జరిగితే మాత్రం కరోనా తో చాలా మంది నాయకుల రాజకీయ జాతకాలు కూడా కర్సు అయిపోక తప్పదని అంటున్నారు. చూడాలి మరి ఈ గండాన్ని ఏలికలుగా ఉన్న నేతలు ఎలా తప్పించుకుంటారో. ఏది ఏమైనా కరోనా మహమ్మారి చాలా విషయాల్లో అల్లరి పెట్టేలాగే ఉంది మరి అంటున్నారు.






మరింత సమాచారం తెలుసుకోండి: