రాజకీయాల్లో నిన్నటి విధానం నేడు నప్పదు, ఇవాళ అమలు చేసింది రేపు అసలు కుదరదు. ఎందుకంటే ఇది జనాలతో ముడి పడి ఉన్న రంగం. జనాల మైండ్ సెట్ ను బట్టీ రాజకీయ కధ నడపాలి. అది ఎలా మారుతుందో ఎపుడెలా దేని మీద అట్రాక్ట్ అవుతుందో ఎవరికీ తెలియదు.

విషయానికి వస్తే టీడీపీ అధినేత  చంద్రబాబు ఏ రొజుకు  ఆ రోజుకు అంది వచ్చిన అంశాన్ని పట్టుకుని అధికార పార్టీని దడ పుట్టిస్తున్నారు. దాని మీదనే మొత్తం ఫోకస్ పెడుతున్నారు. పార్టీ నేతలకు కూడా అదే విషయం మీద మాట్లాడాలని ఆదేశాలు వెళ్తున్నాయి. అంతవరకూ ఓకే. కరెంట్ టాపిక్స్ అప్పటికపుడు పేలుతాయి. బాగానే ఉంటాయి. కానీ దాని వల్ల పార్టీ బతుకుతుందా. ముందుకు సాగుతుందా అన్నదే ఇక్కడ పాయింట్.

పార్టీ జనాల్లోకి పోవాలన్నా కనెక్ట్ కావాలన్నా కంటెంట్ ఉన్న ఇష్యూస్ ని కూడా  టేకప్ చేయాలి. కొత్తగా ఆలోచన చేయాలి. దీర్ఘ‌కాలంలో జనం పడే ఇబ్బందులు, వారికి కలగబోయే కష్టాలు, నష్టాలు ఏకరువు పెట్టాలి. అలా జనాలను తమ వైపునకు తిప్పుకోవాలి. మొన్న ఇసుక, నిన్న దేవాలయాల మీద దాడులు, నేడు కరోనా ఇలా పూటకో అంశాన్ని ఎంచుకుని పోరాటాలు చేస్తే టీడీపీ పటిష్టం అవుతుందా అన్న డౌట్లు వస్తున్నాయి.

దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. అవి రాష్ట్రంలోనూ ఇంటర్ లింక్ అయి ఉన్నాయి.  కొత్త వ్యవసాయ చట్టాల మీద టీడీపీ స్టాండ్ ఏంటో గట్టిగా చెప్పింది లేదనే విమర్శలు ఉన్నాయి. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇష్యూ అలాగే ఉంది. మరో వైపు చూస్తే కేంద్రం కర్ర  పెత్తనం రాష్ట్రాల మీద ఉంది. అలాగే పెట్రోల్, డీజిల్ ధరల విషయం కూడా ఇపుడు పెర్మనెంట్
టాపిక్ గా ఉంది. ఇది చాలా మంది జనాలకు రీచ్ అయ్యేది.

వీటితో పాటు రేపటి రోజున దేశంలో మారుతున్న రాజకీయ వాతావరణాన్ని అవలోకనం చేసుకుని దానికి తగినట్లుగా పొలిటికల్  అజెండా సెట్ చేసుకుంటే బాగుంటుంది, ఆయా వర్గాలు చేరువ అవుతాయి అన్న విశ్లేషణలు ఉన్నాయి. అంతే తప్ప పెరుగుతున్న కరోనా  ఆందోళన చేయడం వల్ల ఉపయోగం ఉండదు కదా. ఇక వ్యాక్సిన్ మీద  కేంద్రాన్ని ముందు డిమాండ్ చేసి ఆ మీదట ఏపీ సర్కార్ ని నిలదీస్తే బాగుంటుంది కదా. ఏది ఏమైనా టీడీపీ లో ఇపుడు ఏ రోజు టాపిక్ ఆ రోజు అన్నట్లుగానే పోరాటాలు సాగుతున్నాయన్న విమర్శలు అయితే ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: