బీజేపీ పెట్టాక ఎన్నడూ చూడని వైభవాలను తీసుకువచ్చిన ఘనత అచ్చంగా మోడీకే దక్కుతుంది. బీజేపీకి రెండు కళ్ళు లాంటి వాజ్ పేయ్, అద్వానీలు కూడా కొంతవరకే దూకుడు చూపించారు. నాడు ఉన్న రాజకీయాలు కానీ వారిద్దరూ పాటించిన రాజకీయ విధానాలు కానీ బీజేపీ జోరుని ఒక దశకే పరిమితం చేశాయి.

అయితే మోడీ అమిత్ షా వచ్చాక బీజేపీ జెట్ స్పీడ్ తో దూసుకుపోయింది. ఒక దశలో దేశంలోని 23 రాష్ట్రాల్లో బీజేపీ తానుగా, మిత్రులతో కూడి అధికారాన్ని సొంతం చేసుకుంది. 2019 ఎన్నికల్లోనూ అదే తీరున బీజేపీకి ఫుల్ మెజారిటీని మోడీ షా ద్వయం సాధించి పెట్టారు. అయితే గత రెండేళ్ళుగా కమల రధం కదన రంగాన కంగారు పడుతోంది, తడబడుతోంది.  బీజేపీ ఈ విధంగా మారడం వెనక కచ్చితంగా మోడీ, షా తీరే కారణంగా చెబుతున్నారు. అయిదు రాష్ట్రాల  ఎన్నికల తరువాత బీజేపీ ప్రాభవం మరింతగా తగ్గింది. ఇక వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ సహా మరికొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. దానికి ముందు సెమీ ఫైనల్స్ గా తాజగా జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీజేపీ బొక్క బోర్లా పడింది. అంతే కాదు ఆ పార్టీ ప్రత్యర్ధి సమాజ్ వాద్ పార్టీ దూకుడు చూపించింది.

ఇక అక్కడ ఉన్న మరో పార్టీ బహుజన సమాజ్ పార్టీ కూడా బాగానే స్కోర్ చేసింది. అన్నిటికీ మించి ఇండిపెండెంట్లు కూడా బాగానే రాణించారు. జిల్లా పరిషత్ ఎన్నికల ఫలితాలు చూస్తే మొత్తం 3,050 స్థానాలకు గానూ బీజేపీ మద్దతుదారులు 599 చోట్ల మాత్రమే గెలిచారు. సమాజ్ వాదీ పార్టీ చూస్తే 790, బీఎస్పీ 354 చోట్ల విజయం సాధించడం విశేషం. ఇక స్వతంత్రులు అయితే 1247 చోట్ల గెలిచి తామే ఫస్ట్ అనిపించుకున్నారు. మోడీ ప్రాతినిధ్యం వహిస్తునన్ వారణాసిలోనూ, ముఖ్యమంత్రి యోగీ సొంత సీటులోనూ కూడా సమాజ్ వాది పార్టీ మద్దతుదారులే గెలవడం బట్టి చూస్తూంటే 2022లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఇబ్బందులు తప్పవని అంటున్నారు. ఇప్పటికే కర్నాటాకలో జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లఒనూ బీజేపీ దెబ్బతింది. మొత్తానికి చూస్తే బెంగాల్ స్ట్రోక్ కి మించే యూపీ దెబ్బ ఉంటుంది అంటున్నారు విశ్లేషకులు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: