భారత్ లో జమ్ము కాశ్మీర్ భాగమైనప్పటికి గతంలో ఏమాత్రం సంబంధం లేకుండా ప్రత్యేక రాష్ట్రంగా నిలుస్తూ వచ్చింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎంతో సుందరమైన ఈ రాష్ట్రం ఎప్పుడూ కూడా ఉగ్రవాదానికి అడ్డాగా మారి అల్లర్లకు, అశాంతికి కేంద్ర బిందువుగా మారింది. ముఖ్యంగా దేశ స్వాతంత్ర్య సమయంలో అనగా 1947-48 సంవత్సరాలలో జమ్ము కాశ్మీర్ లో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన మరణహోమాన్ని అంతా తేలికగా ఎవరు మర్చిపోరు. ఎంతో మంది కాశ్మీర్ మజ్లీలను ఊచకోత కోసి కోసి కాశ్మీర్ లోయను ఆక్రమించుకున్నా వైనం అందరికీ తెలిసిందే. ఇక అప్పటినుండి కూడా కాశ్మీర్ లో నిత్యం అల్లర్లతో రగులుతూనే ఉంది. 

ఇక అక్కడ కొద్ది శాతంలో ఉన్న కాశ్మీర్ మజ్లీలను 1990 లలో పాకిస్థాన్ వేర్పాటు వాదులు వదిలిపోయేలా చేయడంతో కాశ్మీర్ పై పూర్తి స్థాయిలో పట్టు సాధించి ఇష్టారాజ్యంగా కాశ్మీర్ పై పట్టు సాధించారు. ఇక ఆ తరువాత మోడి అధికారంలోకి వచ్చిన తరువాత ఈ అల్లర్లకు చెక్ పెట్టేందుకు మోడి ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేసింది. దీంతో కాశ్మీర్ లో అల్లర్లు చాలావరకు తగ్గాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

అయితే ప్రస్తుతపు పరిస్థితులను గమనిస్తే పశ్చిమ బెంగాల్ మరో కాశ్మీర్ కానుందా అనే అనుమానాలు రాక మానవు. ఎందుకంటే బెంగాల్ లో ఎన్నికల తరువాత చెలరేగిన హింస యావత్ దేశాన్ని ఒక్క సారిగా బెంగాల్ వైపు చేసేలా చేసింది. తృణముల్ పార్టీకి చెందిన వారీగా చెప్పుకొంటూ రోహ్యంగులు, బంగ్లాదేశ్, బర్మా వంటి ఇతర దేశాల నుండి వచ్చిన వారు బెంగాల్ లో ఉన్న స్థిర భారతీయులపై మారణహోమం సృష్టిస్తున్నారు. దీంతో ఎంతో మంది స్థిర భారతీయులు బెంగాల్ ను వదిలి ఇతర రాష్ట్రాలకు వలస వెళుతున్నారు. అయితే ఈ హింసను మమతనే ప్రేరేపిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికి బెంగాల్ లోని ప్రస్తుతపు పరిస్థితులు చూస్తుంటే బెంగాల్ మరో కాశ్మీర్ గా మరనుందా అనే అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: