ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కాడ్నుంచి ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ప్రతి విషయంలో కూడా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ముఖ్యంగా సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగే విధంగా ముందుకు సాగుతున్నారు   అయితే తమది ధనికులకు మంచి చేసే ప్రభుత్వం కాదని పేదలను ఆదుకునే ప్రభుత్వం అంటూ తన నిర్ణయాల ద్వారా సీఎం జగన్ ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నారు. కరోనా వేర్ ఇస్ క్లిష్ట పరిస్థితుల్లో సైతం అటు ప్రజలు అందరికీ అండగా నిలబడుతున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.



 అయితే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా గ్రామాల అభివృద్ధికి ఎన్నో చర్యలు చేపట్టారు గ్రామాలను అభివృద్ధి చేసేందుకు గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చారు అనే విషయం తెలిసిందే.  మొన్నటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కూడా ప్రత్యేకాధికారుల పాలన కొనసాగింది. కాగా పంచాయతీ ఎన్నికల నిర్వహణలో జాప్యం జరగడంతో చివరికి 2018 ఆగస్టు నుంచి ప్రత్యేక అధికారులు పాలన కొనసాగిస్తున్నారు. ఇక ఇటీవల రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని అన్ని పంచాయతీ లలో కూడా సర్పంచులు ఎన్నుకోబడ్డారు.



 అయితే ఇప్పుడు వరకు సర్పంచులు ఎన్నుకోబడ్డారు కానీ గ్రామాభివృద్ధికి పాటుపడేందుకు వారికి ఎలాంటి అధికారాలు మాత్రం రాలేదు. ముఖ్యంగా ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి సర్పంచ్ లకు చెక్ పవర్ రాకపోవడం గమనార్హం. ఈ ఈ క్రమంలోనే  కీలక నిర్ణయం తీసుకున్న జగన్ మోహన్ రెడ్డి సర్కారు ఇటీవలే సర్పంచ్ లకు చెక్ పవర్ అందిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మరో వారం లోపు దీనికి సంబంధించిన పూర్తి కార్యాచరణ సిద్ధం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సి ఎఫ్ ఎం ఎస్ సిస్టంలో సర్పంచు లకు సంబంధించిన పూర్తి వివరాలు డిజిటల్ సంతకాన్ని కూడా నమోదు చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: