కరోనా సెకండ్ వేవ్  ప్రభావం  అత్యంత వేగంగా వ్యాపిస్తుంది.. ఈ మేరకు కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు.. కరోనా నుంచి ప్రజలను కాపాడేందుకు కొత్త వ్యూహాలు రచిస్తున్నారు. ఎప్పటికప్పుడు కరోనా కేసులను పరిశీలిస్తూ వస్తున్నారు. మరో వైపు  వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.. ఇప్పటికే వ్యాక్సిన్ కొరత పై చర్యలు తీసుకుంటామని తెలిపారు.   మరోవైపు వ్యాక్సిన్ కోసం మిత్ర దేశాల సాయాన్ని కోరారు.. వారికి తోచిన సాయం చేయడానికి ముందుకు వచ్చారు...


కాగా, ఇన్ని చర్చలు  ఒకవైపు తీసుకుంటున్నా కూడా వైరస్ వ్యాప్తి పది రెట్లు అధికంగా కరోనా బారిన పడుతూ మరణిస్తున్నారు. దీంతో దేశంలోని కొన్ని రాష్ట్రాలు కర్ఫ్యూ తో పాటుగా లాక్ డౌన్ ను కూడా విధించారు. మరి కొన్ని ప్రాంతాల్లో మాత్రం కరోనా కేసులు పెరగడంతో సంపూర్ణ లాక్ డౌన్ పెట్టేశారు.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ విషయం పై చర్చలు జరుగుతున్నాయి. లాక్ డౌన్ ను విధిస్తే రాష్ట్రాల ఆర్ధిక పరిస్థితి ఇంకా దెబ్బతింటుందని భావిస్తున్నారు.. ఇక ఈ విషయం పై తాజాగా సీఎం కేసీఆర్ స్పందించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించబోమని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా కేసులను నిరోధించడానికి లాక్‌డౌన్ పరిష్కారం కాదని కేసీఆర్ అన్నారు. లాక్‌డౌన్ వల్ల ఆర్థికవ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని, ఇతర రాష్ట్రాల్లో లాక్‌డౌన్ పెట్టినా కేసులు తగ్గడం లేదని, అంతేకాకుండా దానివల్ల జనజీవనం స్థంభించిపోతుందని కేసీఆర్ చెప్పారు. రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులపై ప్రగతి భవన్‌లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సీఎం కేసీఆర్ నేడు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ విషయం పై దాదాపు 4 గంటల పాటు అధికారులతో సీఎం చర్చించారు..


కరోనా ను ఎలా ఎదుర్కోవాలి అనే విషయం పై ప్రణాళికలను రూపొందించాడు..కరోనా పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు..ఇది ఇలా ఉండగా.. యాంటీవైరల్ డ్రగ్ రెమ్‌డెసివిర్ కేటాయించిన కోటాను వెంటనే రాష్ట్రానికి విడుదల చేయాలని కోరుతూ రావు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఫోన్‌లో మాట్లాడారు.రాష్ట్రానికి 4,900 ఇంజెక్షన్లు మాత్రమే రిడెసివిర్ అందుతున్నాయని, అదే 25 వేలకు పెంచాలని రావు అన్నారు.. మరి ఆంధ్రా పరిస్థితి ఏంటో, సీఎం ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: