అయిదు రాష్ట్రాల ఎన్నికల తరువాత దేశంలో రాజకీయ వాతావరణం పూర్తిగా మారిపోయింది. పైగా కరోనా రెండవ దశ దేశంలో ముమ్మరంగా ఉంది. దాన్ని సరిగా డీల్ చేయడంలో కేంద్రం విఫలం అయింది అన్న విమర్శలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో మోడీ ఒక విధంగా డిఫెన్స్ లో పడినట్లుగానే అంతా భావిస్తున్నారు.

సరిగ్గా ఇటువంటి విపత్కర పరిస్థితులలో  ఆయనకు అనుకోని మద్దతు, అనూహ్యంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ నుంచి  వచ్చింది. జగన్ ఇప్పటిదాకా మోడీ సర్కార్ కి తెర వెనక మద్దతు ఇస్తూ వచ్చారు. అంతే తప్ప బాహాటంగా ఒక్కసారి కూడా మాట్లాడలేదు. కానీ ఫస్ట్ టైమ్ జగన్ తన మనసులోని మాటను బయటపెట్టారు. అది ఎలాగంటే జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ మోడీని కరోనా విషయంలో రాష్ట్రాల మాట వినిపించుకోవడం లేదని అంతా తాను అనుకున్నట్లుగా చేసుకుంటూ వెళ్తున్నారు అని తాజాగా విమర్శించారు.

దానికి బీజేపీ నుంచి రియాక్షన్ అయితే రాలేదు కానీ ఏపీ సీఎం జగన్ మాత్రం సోరెన్ కి సున్నితంగానే చెప్పాల్సింది చెప్పారు. ఈ కష్ట సమయాన మోడీకి మద్దతుగా మననంతా నిలవాలి అని ఆయన సోరెన్ కి హితబోధ చేశారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఈ సమయంలో విమర్శలు చేసుకోవడం కంటే కలసికట్టుగా కరోనా మహమ్మారి మీద పోరాడితేనే ఫలితం ఉంటుందని మోడీ కూడా మరింత గట్టిగా పనిచేయగలరు అంటూ సోరెన్ కి జగన్ హితవు చెప్పారు. సరే కరోనా వేళ అంటూ మోడీకి జగన్ మద్దతు తాను ఇస్తూ అందరినీ ఇవ్వాలని కోరినా ఇది రాజకీయంగా కూడా ప్రకంపనలు సృష్టించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుచేతనంటే దేశంలో కరోనా తీవ్రత ఈ రేంజిలో ఉండడానికి మోడీ సర్కార్ ఉదాశీనత ప్రధాన కారణం అని దాదాపు అందరు ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నాయకులు మోడీని పెద్ద ఎత్తున విమర్శిస్తున్న వేళ జగన్ ఇలా అవుట్ రేట్ గా మద్దతు ప్రకటించడం మాత్రం సంచలనమే అవుతోంది.









మరింత సమాచారం తెలుసుకోండి: