ప్రపంచ దేశాలలో ఎల్లప్పుడు శత్రుత్వంతో రగిలిపోయే దేశాలలో భారత్, పాక్ ముందు వరుసలో ఉంటాయి. ఈ రెండు దేశాల మద్య ఉండే శత్రుత్వం ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ తెలిసిందే. భారత్ అభివృద్దిని ఓర్వలేక పాక్ ఎప్పుడు కూడా కయ్యానికి కాలు దువ్వుతూనే ఉంటుంది. ప్రస్తుతం భారత్ పాక్ కంటే సైనిక, వైజ్ఞానిక, వంటి అన్నీ రంగాలలో కూడా ముందంజలో ఉంది. అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న భారత్ పై ఎప్పుడు విషాన్ని చిమ్మే పాక్ ప్రస్తుతం భారత్ పై ప్రశంశలు కురిపిస్తుంది. 

 ఇటీవల పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా అందరినీ ఆకర్షిస్తున్నాయి. విదేశాలలో పాక్ రాయబార కార్యాలయాల కంటే భారత రాయబార కార్యాలయాలే చక్కగా పని చేస్తాయని ఇమ్రాన్ కితాబ్ ఇచ్చారు. దౌత్యవేత్తల సమావేశంలో ఇమ్రాన్ స్పందిస్తూ విదేశాల్లో ఉన్న తమ భారతీయులకు సహకారం అందించడంలో గాని, పెట్టుబడులను సాధించడంలో గాని భారత రాయబారులు చక్కగా పని చేస్తున్నారని, ఈ విషయంలో పాక్ రాయబారులు భారత్ ను చూసి నేర్చుకోవాలని ఇమ్రాన్ ఖాన్ తమ దేశ రాయబారులకు హితవు పలికారు. 

సోవి రాజధానిలో పాకిస్థానీయుల పట్ల పాకిస్థాన్ రాయబార కార్యాలయ ఉద్యోగులు కఠినంగా వ్యవహరిస్తున్నారని, అక్కడ పని చేసే కార్మికులు ఇచ్చిన పిర్యాదుపై స్పందించిన పాక్ ప్రధాని ఆవిధంగా చెప్పుకొచ్చారు. అంతే కాకుండా అక్కడ రాయబార కార్యాలయంలో పని చేసే ఆరుగురు అధికారులను వెనక్కి పిలిచింది పాక్ ప్రభుత్వం. విదేశాల్లో ఉన్న పాకిస్థానీయులకు అక్కడ ఉన్న రాయబార కార్యాలయాలు అండగా ఉంటున్నాయా లేదా అనే దానిపై నివేదిక సమర్పించాలని విదేశీ వ్యవహాల శాఖను ఇమ్రాన్ ఆదేశించారు. ఏది ఏమైనప్పటికి ఎప్పుడు భారత్ పై కారాలు మిరియాలు నూరే పాక్ ప్రధాని భారత అధికారులపై ఒక్కసారిగా పొగడ్తలు కురిపించడం వెనుక ఆంతర్యం ఏమిటనేది ఆలోచించాల్సిన విషయం. .

మరింత సమాచారం తెలుసుకోండి: