గత ఏడాది చైనాలో పుట్టి యావత్ ప్రపంచాన్ని మొత్తం అతలాకుతలం చేసిన కరోనా వైరస్ ప్రభావం ఈ ఏడాది కూడా కొనసాగుతూనే ఉంది. గత ఏడాదితో ఈసారి సెకండ్ వేవ్ రూపంలో ఈ మహమ్మారి తీవ్రత మరింత పెరిగింది. ముఖ్యంగా ఈ సెకండ్ వేవ్ ప్రభావం ప్రస్తుతం భారత్ లో ఉదృతంగా కొనసాగుతుంది. దేశంలో రోజుకు లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు నమోదు అవుతున్నాయి. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు కఠిన చర్యలు చేపడుతున్నాయి.

అయినప్పటికి కోవిడ్ ప్రభావం ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. దీంతో ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లను ప్రతి ఒక్కరికీ అందే దిశగా ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. ప్రస్తుతం మన దేశంలో భారత బయోటెక్ కంపెనీ తయారు చేసిన కోవాక్సిన్, అలాగే సీరం కంపెనీ తయారు చేసిన కోవాషీల్డ్ టీకాలు కోవిడ్ నియంత్రణకు వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. వీటి ద్వారా ఇప్పటికే వ్యాక్సినేషన్ ప్రక్రియ దేశ వ్యాప్తంగా కొనసాగుతుంది. అయితే ఈ టీకాల పనితీరుపై ప్రజల్లో పలు రకాల అనుమానాలు ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో స్వల్ప సైడ్ ఎఫెక్ట్స్ వస్తూనే ఉన్నాయి.

దీంతో ఆదిక శాతం ప్రజలు వ్యాక్సిన్ పై మొగ్గు చూపడం లేదు. ఇదిలా ఉండగా వ్యాక్సిన్ తీసుకున్న కొందరిలో మరలా కోవిడ్ పాజిటివ్ రావడంతో వ్యాక్సిన్ తీసుకోవడం ఎందుకని మెజారిటీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అయితే వ్యాక్సిన్ అనేది వైరస్ పై తీవ్ర స్థాయిలో ప్రభావం చూపకపోయినప్పటికి శరీరంలో ప్రవేశించిన వైరస్ ను అడ్డుకునేందుకు రోగనిరోదక శక్తిని ఉత్తేజపరచడంలో కీలక పాత్ర వహిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా వైరస్ ఇతర కణాలకు వ్యాపించకుండా, ప్రాణాంతక పరిస్థితి నుండి కాపాడేందుకు వ్యాక్సిన్ ఉపయోగ పడుతుందని వైద్యులు చెబుతున్నారు. అయినప్పటికి వ్యాక్సిన్ పై ప్రజల్లో అనుమానాలు తొలగి పోకపోవడం, వ్యాక్సిన్ పై నిర్లక్ష్యం చెయ్యడం వంటి కారణాల వల్ల కోవిడ్ మరింత విజృంబిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: