గతేడాది చైనాలో పుట్టిన కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని వణికించింది. ఈ మహమ్మారి బారినపడి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది ఈ వైరస్ బారినపడి సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నారు. మరోవైపు దేశంలో లాక్ డౌన్ విధించడంతో ఆర్థికంగా చాలా నష్టపోయారు. ఇక ఈ నష్టాల ఊబి నుండి కోలుకుంటున్న సమయంలోనే దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉగ్రరూపం దాల్చింది.

 ఇక దేశంలో రోజురోజుకి కరోనా వైరస్‌ కేసులు లక్షల్లో నమోదవుతుంటే మరణాలు వేలల్లో సంభవిస్తున్నాయి. దీంతో  దేశంలో కరోనా వ్యాప్తిని, మరణాల్ని తగ్గించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత‍్నాల్ని ముమ్మరం చేశాయి. ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్‌ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. అయితే దీన్ని అదునుగా భావించిన కేటుగాళ్లు కల్తీ కరోనా వ్యాక్సిన్లతో సొమ్ము చేసుకుంటున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పంజాబ్‌ రాష్ట్రం రూప్‌ నగర్‌ పట్టణ సమీపంలో ఉన్న భాక్రా డ్యామ్‌ కెనాల్‌ లో రెమిడెసివిర్‌ కరోనా వ్యాక్సిన‍్లను గుర్తించినట్లు సాలెంపూర్ గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో డీఎస్పీ చంకౌర్ సాహిబ్ స్థానిక ఎస్సై, డ్రగ్‌ ఇన్ప్సెక్టర్‌, సీనియర్‌ మెడికల్‌ అధికారులను ఘటనస్థలానికి పంపి సోదాలు జరిపించారు. ఈ సోదాల్లో నకిలీ కరోనా వ్యాక్సిన్‌ రెమిడెసివిర్‌తో పాటు మరో ప్రాంతంలో శ్వాసకోశ సంబంధిత సమస్యలకు వినియోగించే సెఫోఫెరాజోస్‌ డ్రగ్‌ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా రూప్‌ నగర్‌ "సీనియర్‌  సూపరిటెండెంట్ ఆఫ్ పోలీస్ అఖిల్ చౌదరి మాట్లాడుతూ.. గ్రామస‍్తుల సమాచారంతో సెఫోపెరాజోన్, రెమెడిసివర్‌ లు కలిపి మొత్తం 1200 వ్యాక్సిన్‌ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నాం. అయితే డ్రగ్‌ అధికారులు పరిశీలించగా నకిలీ వ్యాక్సిన్లని తేలింది. కేటుగాళ్లు కావాలనే ధనార్జనే కోసమే నకిలీ వ్యాక్సిన్లను తయారు చేశారు. మేం దాడులు చేస్తామని  తెలుసుకొని భాకక్రా డ్యామ్‌ లో పడేశారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించాం. త‍్వరలోనే నిందితుల్ని అరెస్ట్‌ చేస్తాం. కరోనా బాధితులు వ్యాక్సిన్‌ కొనుగోలు చేసే సమయంలో ఒరిజినలా? నకిలీవా"అనేది గుర్తించాలన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: