ఇక ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. రోజుకి ఎన్నో లక్షల కేసులు ఇంకా ఎన్నో వేల మరణాలు కూడా నమోదవుతున్నాయి. ఇక కరోనా మహమ్మారిపై సోనియా గాంధీ బాధ్యతాయుత ప్రకటన చేశారు.ఇక కరోనా మహమ్మారిని బాగా ఎదుర్కోవటానికి సమిష్టి చర్య మరియు జవాబుదారీతనం ఉండేలా స్టాండింగ్ కమిటీలను ఏర్పాటు చేయాలని సోనియా గాంధీ డిమాండ్ చేశారు.ఇక కరోనా దేశంలో రాజకీయ విభేదాలని అంతం చేసిందన్నారు. కరోనా కట్టడికి దేశం అంత కృషి చెయ్యాలని చెప్పారు.ఇంకా సోనియా గాంధీ మాట్లాడుతూ , వ్యవస్థ విఫలం కాలేదు కాని మోడీ ప్రభుత్వం భారతదేశం యొక్క అనేక బలాలు మరియు వనరులను నిర్మాణాత్మకంగా మార్చలేకపోయిందిని చెప్పారు.ఈ సమావేశంలో సోనియా గాంధీ ఇంకా మాట్లాడుతూ భారతదేశంలోని కోవిడ్ -19 పరిస్థితిపై మోదీ ప్రభుత్వం దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు సోనియా గాంధీ.


ఇంకా సోనియా గాంధీ మాట్లాడుతూ చాలా దురదృష్టవశాత్తు, అన్ని రాష్ట్రాల్లో  స్వంత పనితీరు చాలా నిరాశపరిచిందని మరియు ఆమె ఊహించని విధంగా ఫలితాలను సమీక్షించడానికి సిడబ్ల్యుసి త్వరలో సమావేశమవుతోంది, కాని పార్టీ సమిష్టిగా తాము ఈ ఎదురుదెబ్బ నుండి తగిన పాఠాలను నేర్చుకున్నామని తెలిపారు.వినయం మరియు నిజాయితీతో ఏ పనైనా చెయ్యాలని బాధ్యతాయుతంగా చెప్పారు సోనియా గాంధీ.అలాగే ఈ రాజకీయాలు, పార్టీలు ఇవన్నీ తరువాత సంగతులని వీటి కంటే ముందు దేశంలో కోవిడ్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రజల కోసం పోరాడాలని ఆమె మాట్లాడిన తీరు ఎంతగానో ఆకట్టుకుంది.తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కూడా సోనియా గాంధీ అభినందించారు.రాజకీయ విషయాలు, పార్టీ విషయాలు గురించి పక్కన పెడితే జనాల ఆరోగ్య విషయంపై, అలాగే ప్రస్తుతం వున్న కరోనా మహమ్మారిని అరికట్టడానికి అందరూ కృషి చెయ్యాలని ఆమె చెప్పిన మాటలు చాలా ఆకట్టుకుంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: