క్యాన్సర్.. ఆధునిక యుగంలో మనిషిని భయపెడుతున్న మహమ్మారి వ్యాధి ఇది. ఈ క్యాన్సర్ అనేక రకాలు.. ఇది ఎందుకు వస్తుందో.. ఎలా వస్తుందో కూడా తెలియదు. మద్యపానం, ధూమపానం వంటి హానికరమైన అలవాట్లు లేని వారు  కూడా తరచూ క్యాన్సర్ బారిన పడుతుంటడం చూస్తుంటాం. అలాంటి క్యాన్సర్‌ను  ముందుగానే గుర్తిస్తే చాలా వరకూ మరణాలను అధిగమించొచ్చు..ఈ దిశగా ఓ సంచలనాత్మక విజయం నమోదు చేసింది ముంబయికి చెందిన స్టార్టప్‌ సంస్థ ఎపిజెనెరస్ బయోటెక్నాలజీ లిమిటెడ్.


ఎపిజెనెరస్ బయోటెక్నాలజీ లిమిటెడ్ సంస్థను నానోటెక్నాలజీ సైంటిస్ట్ వినయ్ కుమార్ త్రిపాఠి, ఆయన కుటుంబం ఈ సంస్థను నడిపిస్తున్నారు. ఈ ఎపిజెనెరస్ బయోటెక్నాలజీ కనిపెట్టిన విధానం ద్వారా కేవలం రక్త పరీక్ష ద్వారానే దాదాపు 25 రకాల క్యాన్సర్లను గుర్తించొచ్చు. మరో విశేషం ఏంటంటే... వివిధ రకాల క్యాన్సర్లు ట్యూమర్లుగా  మారకముందే రక్త పరీక్ష ద్వారా వాటిని గుర్తించడగలగడం. ఇది క్యాన్సర్ చికిత్స రంగంలో ఓ సంచలన విజయంగా వర్ణిస్తున్నారు సైంటిస్టులు.

 
క్యాన్సర్ చికిత్సలపై జరుగుతున్న పరిశోధనల్లో ఇది గొప్ప మార్పుగా చెబుతున్నారు. ఇది పూర్తిగా అందుబాటులోకి వస్తే క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించొచ్చు. దీని ద్వారా క్యాన్సర్  మరణాలు గణనీయంగా తగ్గుతాయి. ఏటా క్యాన్సర్ కారణంగా ప్రపంచంలో లక్షల సంఖ్యలో చనిపోతున్నారు. ఇకపై అలా జరగకుండా ఈ పరీక్ష కాపాడుతుంది. అనేక కుటుంబాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోకుండా ఈ పరీక్ష కాపాడుతుంది.


“సాధారణ రక్త పరీక్ష ద్వారా కణితి ఏర్పడక ముందే, మేము అన్ని రకాల క్యాన్సర్లను ముందుగానే గుర్తించగలమంటున్నారు  సంస్థ సీఈవో ఆశిష్ త్రిపాఠి. అంతే కాదు.. ఇది ప్రపంచంలో క్యాన్సర్‌కు సంబంధించిన మొదటి రోగనిర్ధారణ పరీక్ష కూడా అని చెబుతున్నారు. ఏడాదికోసారి ఈ పరీక్ష చేయించుకోవడం ద్వారా క్యాన్సర్ ముప్పు నుంచి సురక్షితంగా రక్షించుకోవచ్చని చెబుతున్నారు. ఈ పరీక్ష కిట్లను రూపొందిస్తే అది కోట్ల రూపాయల వ్యాపారంగా మారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: