తెలంగాణ‌లో సెల్ఫ్ లాక్‌డౌన్‌లు అమ‌ల‌వుతున్నాయి. క‌రోనా మ‌హమ్మారి అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతూ ప‌ల్లెజ‌నాన్ని సైతం పొట్ట‌న పెట్టుకుంటోంది. దీంతో ప‌ల్లెల్లు, ప‌ట్ట‌ణాల్లోని జ‌న స‌ముహాలు అప్ర‌మ‌త్త‌మ‌య్యాయి. క‌రోనా ఉగ్ర‌రూపం దాల్చ‌డంతో రోజూ వేలాది కేసులు న‌మోద‌వుతున్నాయి. దీంతో గ్రామాల్లో, ప‌ట్ట‌ణాల్లోని కాలనీల్లో సెల్ఫ్ లాక్‌డౌన్‌ను అమ‌లు చేసుకుంటున్నారు. కేసులు అత్య‌ధికంగా న‌మోద‌వుతున్న ప్రాంతాల్లో ప్ర‌భుత్వ ఆదేశాల మేర‌కు అధికారులు మైక్రో కంటోన్మెంట్ జోన్ల‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు.గ్రామాల‌కు పైగా సెల్ఫ్ లాక్‌డౌన్‌కు తీర్మానం చేసుకుని అమ‌లు చేసుకుంటుండ‌టం గ‌మ‌నార్హం. ఆంక్ష‌ల‌ను ఉల్లంఘించిన వారికి రూ.1000 నుంచి రూ.5000 వ‌ర‌కు జ‌రిమానాలు విధించేలా తీర్మానాలు చేసుకుంటున్నారు.
 

రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 280కు  కంటోన్మెంట్ జోన్లను ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది. మండ‌ల‌కేంద్రాలు, డివిజ‌న్ కేంద్రాలు సైతం పాక్షిక లాక్‌డౌన్‌ను పాటిస్తున్నాయి. అనేక వ్యాపార‌, వాణిజ్య సంఘాలు, స‌ముహాలు మ‌ధ్యాహ్నం 12గంట‌ల‌కే వ్యాపారాలు నిర్వ‌హిస్తూ అనంత‌రం మూసివేస్తున్నారు. ప్ర‌ముఖ ఆల‌యాల‌న్నీ కూడా ఇప్ప‌టికే మూత ప‌డ్డాయి. మ‌రికొన్ని  ఆల‌యాల్లో ఆంక్ష‌ల‌ను అమ‌లు చేస్తున్నారు. నిర్ణీత స‌మ‌యాల్లో మాత్రమే భ‌క్తుల‌ను అనుమ‌తిస్తున్నారు.వైరస్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో గ్రామాల్లోకి ఎవరూ రాకుండా పకడ్బం దీ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఊరు చుట్టూ ముళ్లకంచెను ఏర్పాటు చేసి కొత్త వారిని అడ్డుకుంటున్నారు. అలాగే వంతుల వారీగా ఊళ్లో గస్తీ తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇతర గ్రామాల నుంచి ఎలాంటి వాహనాలు రాకుండా ప్రత్యేకంగా చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తు న్నారు.


లాక్‌డౌన్‌తో చాలా వ‌ర‌కు ప‌రిస్థితి చ‌క్క‌బ‌డుతోంద‌ని, ఎవ‌రికి క‌రోనా సోకిన తెలిసిపోవ‌డంతో పాటు మిగ‌తా వారు అల‌ర్ట‌వుతున్నార‌ని పేర్కొంటున్నారు. వ్యాధి ప్ర‌బ‌ల‌కుండా ఉండేందుకు లాక్‌డౌన్ దోహదం చేస్తోంద‌ని చెబుతున్నారు. కొన్నాళ్లు ప‌నులు మానుకుని ప్రాణాలు కాపాడుకోవాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లుగా గ్రామాల ప్ర‌జ‌లు స్ప‌ష్టం చేస్తుండ‌టం గ‌మ‌నార్హం. మొత్తానికి కరోనా వైరస్‌ పంజా విసరడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన గ్రామాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ విధించు కోవ డంతో పరిస్థితులు చక్కబడుతున్నాయి. దీంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నాయి. గతంలో రోజుకు పదుల సంఖ్యలో వచ్చిన పాజిటివ్‌ కేసులు ప్రస్తుతం జీరో కేసులుగా నమోదవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: