కరోనా మహమ్మారి దేశంలో ప్రభంజనం సృష్టిస్తున్న సమయంలో  రాష్ట్రాలలో వైద్యసదుపాయాలను మెరుగుపరిచే విధంగా వెంటనే చర్యలు తీసుకోవడం. అత్యవసరమైన కరోనా రోగులకు ఆక్సిజన్ సిలిండర్లను అవసరం మేరకు అందించడానికి ఏర్పాటు చేయడం, వ్యాక్సినేషన్ ను వేగవంతం చేయడం, ప్రజల్ని రోడ్లపై తిరగకుండా కట్టడి చేయడం ఇలా ఎన్నో అంశాలు కేంద్ర ప్రభుత్వంతో ముడి పడి ఉంటాయి. ఒకరకంగా ఇవన్నీ కేంద్రం యొక్క బాధ్యతలనే చెప్పాలి.  అయితే ఆక్సిజన్ సిలిండర్ల ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకొని దేశంలోని పలు రాష్ట్రాల్లో 100 ఆక్సిజన్ ప్లాంట్లను నెలకొల్పేందుకు సంకల్పించింది. అయితే వీటిలో ఒక్క ఆక్సిజన్ ప్లాంటును కూడా ఆంధ్రప్రదేశ్ కు కేటాయించకపోవడం గమనార్హం.  కరోనా కేసుల దృష్ట్యా చూసినా మన రాష్ట్రంలో ఆక్సిజన్ సిలిండర్ల కొరత భారీగానే కనిపిస్తోంది.

కాబట్టి ఆక్సిజన్ ప్లాంట్ ను నెలకొల్పి కరోనా రోగుల వైద్యానికి సహకరించాల్సిన అవసరం చాలానే ఉంది. కానీ కేంద్రం దీనిని గుర్తించకుండా 100 ఆక్సిజన్ ప్లాంట్ లలో ఒక్కటి కూడా ఏపీకి కానీ అటు తెలంగాణకి కానీ కేటాయించలేదు. ఈ విషయంపై ఏపీ ప్రజలు కేంద్రంపై మండి పడుతున్నారు. కేంద్ర సర్కారు ఎప్పుడూ ఏపీ విషయంలో ఇలాగే వ్యవహరిస్తుందని, ప్రత్యేక హోదాను కల్పించడంలో చూపించిన నిర్లక్ష్యం, మొన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టి ఏపీ ప్రజలకు చేసిన అన్యాయమే ఇప్పుడు ఆక్సిజన్ సిలిండర్ల ప్లాంట్ ల విషయంలోనూ జరుగుతోందని  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి ఏమి సమాధానం చెబుతారు, ఏపీ ప్రజల ప్రాణాలంటే మీకు అంత నిర్లక్ష్యమా అని ప్రశ్నిస్తున్నారు.

అంతే కాకుండా తెలుగు 360 అనే ఒక వెబ్ మీడియా ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ సీఎంని ఉద్దేశించి ప్రత్యక్షంగా వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం తీవ్ర దుమారాన్ని రేపుతోంది. జగన్ రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించకుండా కేవలం మోదీని ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారని, అనునిత్యం మోదీ భజన చేస్తున్నారని తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇదంతా కూడా దేశంలో ఈ కరోనా  విపత్కర పరిస్థితుల దృష్ట్యా కేంద్ర పెట్రోలియం శాఖ ఆధ్వర్యంలో దేశంలోని పలు రాష్ట్రాలకు ఆక్సిజన్ ప్లాంట్లను నిర్మించబోతున్నట్లు ప్రకటించింది. ఈ లిస్ట్ లో ఉత్తరప్రదేశ్, బీహార్, కర్ణాటక, గోవా, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, ఒడిశా, మధ్యప్రదేశ్ మరియు ఢిల్లీ రాష్ట్రాలు ఉన్నాయి.  తెలుగు రాష్ట్రాల నుండి మాత్రం అన్ని రకాల ఆదాయాలను పొందుతున్నారు. కానీ ఇలాంటి విషయంలో మాత్రం మన తెలుగు రాష్ట్రాలకు ఇవ్వకపోవడం దేనికి సంకేతమని వీరు ప్రశ్నించారు. ఇకనైనా జగన్ మన రాష్ట్ర ప్రయోజనాల కోసం ముఖ్యంగా ఇటువంటి సమయంలో కేంద్రంతో మాట్లాడి ఆక్సిజన్ ప్లాంట్ల కోసం వారి మెడలు వంచి మరీ తెచ్చుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది అంటూ విమర్శల బాణాలు విసురుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: