ఆంధ్రప్రదేశ్ లో వైద్య సదుపాయాల విషయంలో ప్రజల్లో అనేక ఆందోళనలు ఉన్న సంగతి తెలిసిందే. వైద్య సదుపాయాలకు సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం కూడా ప్రజలను కాస్త ఇబ్బంది పెడుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా కాస్త జాగ్రత్తగానే వెళ్తున్నది. తప్పుడు ప్రచారం చేసే వారి విషయంలో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు సీరియస్ గా వ్యవహరించే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కొన్ని వైద్య సదుపాయాలకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకునే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది అని కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు.

సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి ఇప్పటికే కొన్ని కీలక కంపెనీలతో కూడా రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు తీవ్రస్థాయిలో పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు కొన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. అందుకనే ఏ ఆస్పత్రిలో బెడ్ లు ఎన్ని ఉన్నాయి... ఆక్సిజన్ బెడ్ లు ఎన్ని ఉన్నాయి... వెంటిలేటర్ బెడ్ లు ఎన్ని ఉన్నాయి ఏంటి అనే దానిపై ప్రజలకు ఆన్లైన్లోనే సమాచారం ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది.

దీనికి సంబంధించి ఒక సాఫ్ట్ వేర్ ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. అంతేకాకుండా ప్రతి జిల్లాకు ఒక కాల్ సెంటర్  ను కూడా ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారని మండలానికి ఒక కాల్ సెంటర్ ను ఏర్పాటు చేసి దాన్ని జిల్లా కేంద్రానికి మార్చాలని ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఈ సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టేందుకు ఒక ప్రణాళిక సిద్ధం చేస్తుందని అంటున్నారు. మరి ఈ విషయంలో ఏం జరుగుతుంది ఏం ఏంటీ అనేది చూడాలి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రం దీనికి సంబంధించి ఒక ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్లే విధంగా అధికారులతో సమీక్షలు జరుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: