తెలంగాణలో కరోనా కేసుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కాస్త కఠిన చర్యలకు దిగే అవకాశాలు కనబడుతున్నాయి. కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ప్రజలను కట్టడి చేయడానికి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. ఇప్పటికే మరోసారి కర్ఫ్యూని పొడిగించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మరో ఆలోచన కూడా చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో కేసులు భారీగా ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో కేసులను కట్టడి చేసేందుకు గాను ఇప్పటికే అధికారుల నుంచి కొన్ని నివేదికలు తెప్పించుకున్న రాష్ట్ర ప్రభుత్వం...

ఆయా ప్రాంతాల్లో మినీ లాక్ డౌన్ విధించే ఆలోచనలో కూడా ఉందనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. దీనికి సంబంధించి  ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు క్షేత్ర స్థాయి అధికారులతో నేరుగా మాట్లాడుతున్నారని కూడా సమాచారం. కేసులు భారీగా పెరిగితే ఆయా ప్రాంతాల్లో ప్రజలు మరింత ఇబ్బంది పడటమే కాకుండా ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. అందుకనే మినీ లాక్ డౌన్ ఆలోచన చేస్తున్నట్టుగా సమాచారం. దీనికి సంబంధించి ఇప్పటికే సీఎం కేసీఆర్ కొంతమంది ఆరోగ్యశాఖ అధికారులు రెవెన్యూ శాఖ అధికారులతో మాట్లాడటమే కాకుండా అవసరమైతే అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు కూడా చేయాలని చెబుతున్నట్లు సమాచారం.

ఇక ప్రజలు స్వచ్ఛందంగా లాక్ డౌన్ పాటిస్తున్న నేపథ్యంలో వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అంతేకాకుండా అవసరమైతే కొన్ని ప్రాంతాల సరిహద్దులను కూడా మూసి వేసే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళుతుంది ఏంటి అనే దానిపై త్వరలోనే స్పష్టత రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: