క‌రోనా నివార‌ణ‌కు, నియంత్ర‌ణ‌కు వ్యాక్సిన్ అంద‌జేయ‌డంలో కేంద్ర ప్ర‌భుత్వం ఘెరంగా విఫ‌ల‌మైంద‌నే అభిప్రాయం ఇప్పుడు దేశ వ్యాప్తంగా నెల‌కొని ఉంది. ఇటు ప్రాంతీయ పార్టీల‌తో ఏర్ప‌డిన రాష్ట్ర ప్ర‌భుత్వాలు కూడా కేంద్ర ప్ర‌భుత్వాన్నే దోషిగా నిల‌బెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నాయి. వాస్త‌వానికి కూడా కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాలే వ్యాక్సిన్ పంపిణీలో కీల‌కంగా మారి... వైఫ‌ల్యానికి కార‌ణ‌మ‌య్యాయ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ వైఫ‌ల్యాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాలు, బీజేపీయేత‌ర రాజ‌కీయ శ‌క్తులు జ‌నంలోకి తీసుకెళ్లి.. ప్ర‌ధాన‌మంత్రి మోదీ ప్ర‌భుత్వం వైఫల్యం చెందింద‌నే విష‌యాల‌ను తీసుకెళ్లి వ్య‌తిరేక‌త‌ను క‌లిగించాల‌నే వ్యూహంతో ఉన్న‌ట్లు స‌మాచారం.


ఈక్ర‌మంలోనే కరోనా కేసుల చికిత్స నిమిత్తం పశ్చిమబెంగాల్‌కు మెడికల్‌ ఆక్సిజన్‌ సరఫరా కోటా పెంచాలంటూ ముఖ్యమంత్రిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఇతర రాష్ట్రాలకు కోటా పెంచి, బెంగాల్‌కు మాత్రం తగ్గిస్తున్నారంటూ మోదీని ఇరుకున పెట్టే ప్ర‌శ్న‌ల‌తో .. రాష్ట్రంలో రోజువారీ వినియోగం గత 24 గంటల్లో 470 మెట్రిక్‌ టన్నులు ఉండగా, వచ్చే వారం రోజుల్లో ఇది 550 మె.ట.లకు పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రధాని ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకొని ఆక్సిజన్‌ సరఫరాను సమీక్షించి రోజువారీగా కనీసం 550 మె.ట.ల సరఫరాను తమకు కేటాయించాలని ఆమె కోరారు. ఇంతకంటే తక్కువ సరఫరా చేస్తే కరోనా రోగుల ప్రాణాలకు ముప్పు ఉంటుందన్నారు.


పశ్చిమబెంగాల్‌లో ఉత్పత్తి చేస్తున్న మెడికల్‌ ఆక్సిజన్‌ కోటాను ఇతర రాష్ట్రాలకు గత పది రోజుల్లో 230 నుంచి 360 మె.ట.లకు పెంచి, తమకు మాత్రం రోజుకు 308 మె.ట.లు మాత్రమే సరఫరా చేస్తున్నారంటూ లేఖలో మమత ఆక్షేపించారు. ఇదిలా ఉండ‌గా భారత్‌లో మే1 నుంచి 18ఏళ్లు నిండిన అందరికీ వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే టీకాల కొరత కారణంగా చాలా రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదు. దీంతో ప్రస్తుత పరిస్థితుల్లో నిపుణుల కమిటీ తీసుకునే నిర్ణయం టీకాల సరఫరా, తయారీ సంస్థలపై నెలకొన్న ఒత్తిడిని తగ్గిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు, రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సిన్‌ కొరత ఏర్పడడంతో రెండో డోసు వేసుకోవాల్సిన వారి సంఖ్య సైతం క్రమంగా పెరుగుతూ వస్తోంది.




మరింత సమాచారం తెలుసుకోండి: