దేశాన్ని మొత్తం కరోనా వైరస్ కమ్మేస్తోంది...  దేశంలో ప్రస్తుతం మారణహోమం కొనసాగుతోంది. కరోనా వైరస్ వెలుగులోకి వచ్చినప్పటి నుంచి మనిషి జీవన శైలి మారిపోయింది...  కరోనా వైరస్ పేరెత్తితే చాలు ఉలిక్కి పడి లేచే పరిస్థితి ఏర్పడింది   రోజు రోజుకు దేశంలో వెలుగులోకి వస్తున్న కేసులు చూస్తూ ఉంటే అందరిలో ప్రాణ భయం నెలకొంది.ఈ క్రమంలోనే  మహమ్మారి వైరస్ ఎక్కడ పంజా విసిరి ప్రాణాలను బలి తీసుకుంటుందో అని అందరూ ఊపిరి బిగపట్టుకొని బతికే పరిస్థితి ఏర్పడుతుంది.


 అయితే ఇప్పటివరకు ఒక మనిషి తుంపర్ల ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుంది ఎన్నో అధ్యయనాల్లో వెల్లడైంది. కానీ ఇప్పటికీ కూడా ఎంతో మందిలో వైరస్ వ్యాప్తి పై ఎన్నో అనుమానాలు అపోహలు మనసులో కలవరపెడుతు ఉన్నాయి. ముఖ్యంగా నీటి ద్వారా వైరస్ సోకే ప్రమాదం ఉందా లేదా అనే దానిపై కూడా ఎంతోమంది అయోమయంలో ఉన్నారు. అయితే ఇటీవల దీనిపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది.  నీటి ద్వారా  వైరస్ సోకే ప్రమాదం అస్సలు లేదు అంటూ స్పష్టం చేస్తోంది. కరోనా వైరస్ నీటిలో పడితే పూర్తిగా దాని శక్తిని కోల్పోతుందని నిర్వీర్యం అయిపోతుంది అంటూ కేంద్ర ప్రభుత్వ ముఖ్య శాస్త్ర సాంకేతిక సలహాదారు విజయ్ రాఘవన్ చెప్పుకొచ్చారు.



 కేవలం ఒక వ్యక్తి తుంపర్ల ద్వారా మాత్రమే గాలి ఎటు వైపు వీస్తే అటు వైపుగా కొంతదూరం పాటు వైరస్ విస్తరించే అవకాశం ఉందని కానీ నీటి ద్వారా మాత్రం ఎక్కడా వైరస్ వ్యాప్తి చెందదు అంటూ చెప్పుకొచ్చారు అయితే కరోనా వైరస్ బారిన పడి చనిపోయిన వారి మృతదేహాలను  యమునా నదిలో పడేస్తూ ఉండడం పై స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలు చెప్పుకొచ్చారు.  అయితే నీటిలో వైరస్ వ్యాపిస్తుంది అని భయం ఎవరికి అవసరం లేదని వైరస్ నీటిలో పడగానే దాని శక్తిని కోల్పోతుంది అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఇటీవలే దేశంలో మూడవ దశ కరోనా వైరస్ కూడా రాబోతోంది అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: