వారు ముగ్గురిదీ భిన్న మనస్తత్వం. రాజకీయంగా చూసినా ఎవరి స్టైల్ వారిదే. ఎవరి ఆలోచనలు వారివే. ప్రజాకర్షణ విషయంలో ముగ్గురూ ముగ్గురే. ఇక ఒక నిర్ణయాన్ని తీసుకోవాలనుకుంటే దూకుడుగా ఉండడంలో కూడా వీరి మధ్య పోలికలు ఉన్నాయి.

అయితే ఈ ముగ్గురికీ ఇపుడు ఒక్కటే సమస్య బాధపెడుతోంది. అదే కరోనా మహమ్మారి. దేశంలోని ఇతర రాష్ట్రాల వారికి కూడా ఈ సమస్య ఉంది కదా అంటే అక్కడ రాజకీయ మరీ ఇంత తీవ్రంగా లేదు. కానీ వీరి విషయంలో చూస్తే చాలా గట్టిగానే విపక్షం నిలబడి మరీ నిలదీస్తోంది. ముందుగా ఏపీ సీఎం జగన్ విషయం తీసుకుంటే ఆయనకు క్రైసిస్ మేనేజ్మెంట్ అసలు తెలియదు అంటున్నారు మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్యచౌదరి. జగన్ దిగిపో ఒక్క నెలరోజులు చాన్స్ ఇస్తే చంద్రబాబు తన సత్తా చూపిస్తారు అంటున్నారు మరో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు. జగన్ కి కరోనాను డీల్ చేసే తీరు తెలియడం లేదు అంటున్నారు మరో నేత అచ్చెన్నాయుడు. ఇక చంద్రబాబు లోకేష్ అయింతే జగన్ ఫెయిల్యూర్ అనేస్తున్నారు. టోటల్ గా చెప్పాలంటే టీడీపీ  శిబిరం మొత్తం జగన్ దిగిపో అంటోంది.

తెలంగాణాలో చూస్తే కాంగ్రెస్ ఇదే తీరున కేసీయార్ ని ఘాటు కామెంట్స్ విమర్శిస్తోంది. కేసెయేర్ కరోనా కట్టడికి సరైన చర్యలు తీసుకోవడం లేదు అంటోంది. ఆయన పెద్దగా దృష్టి పెట్టకపోవడం వల్లనే కేసులు పెరిగిపోతున్నాయని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఇక కేంద్రంలోని మోడీ విషయం కూడా వీరికి ఏమంత భిన్నగా లేదు. ఆయన్ని కూడా దిగిపో అనే మాట విపక్ష నుంచి వస్తోంది. ఇక స్వపక్షంలో ఉంటూ విపక్ష గానం వినిపిస్తున్న ఎంపీ సుబ్రమణ్యస్వామి అయితే కరోనా కట్టడి బాధ్యతలను కేంద్ర మంత్రి గడ్కరీకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు.

దేశంలో కరోనా విలయతాడవం చేస్తోంది. దానికి అంతా కలసి పరిష్కారం కనుగొనాలి. ఈ సమయంలో రాజకీయం చేయడం అంటే కుదరదు. కానీ చూస్తూంటే విపక్షాలు అధికార పార్టీనే టార్గెట్ చేస్తున్నాయి. దేశంలో చాలా రాష్ట్రాల్లో పెద్దగా విపక్షాలు అధికార పార్టీలను టచ్ చేయడంలేదు కానీ ఈ ముగ్గురి విషయంలో మాత్రం చాలా దూకుడునే చూపిస్తున్నాయి. మరి ఈ ముగ్గురికీ ఇపుడు పరీక్షా సమయం లాగానే ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: