తెలంగాణలో కరోనా కేసుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే చర్యలకు సంబంధించి అందరు కూడా ఆసక్తికరంగా చూస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా వ్యవహరించ లేకపోతే పరిస్థితి ఆందోళనకరంగా మారే అవకాశాలు ఉన్నాయి అనే వ్యాఖ్యలు కూడా ఎక్కువగానే వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సరిహద్దులకు సంబంధించి సీఎం కేసీఆర్ కాస్త కఠినంగా వ్యవహరించే అవకాశం ఉండవచ్చని భావిస్తున్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర సరిహద్దుల విషయంలో సీఎం కేసీఆర్ సీరియస్ గా ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని ప్రచారం ఎక్కువగా జరుగుతోంది.

మహారాష్ట్ర సరిహద్దుల్లో కాస్త ఇబ్బందికరంగా ఉన్న నేపథ్యంలో అక్కడ పోలీసులు కూడా కాస్త కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నారు. ప్రధానంగా మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉంది. మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో కేసులు కూడా భారీగా ఉన్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా తెలంగాణ వస్తే పరిస్థితి దారుణం గా మారే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న మూడు నాలుగు జిల్లాల్లో పరిస్థితులు కాస్త కట్టడిలోనే ఉన్నా సరే నిజామాబాద్ జిల్లాలో మాత్రం పరిస్థితి ఆందోళనకరంగా మారింది.

ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు అవుతున్నట్టుగా అర్థమవుతుంది. ఇక అక్కడ ఉన్న ప్రభుత్వంతో కూడా మాట్లాడిన తర్వాత రెండు వారాల పాటు సరిహద్దులను మూసివేసే అంశానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉండవచ్చు అని అందరూ భావిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వెళితే మాత్రం మరి కొన్ని రాష్ట్రాల సరిహద్దులను కూడా మూసి వేసే అవకాశాలు ఉండవచ్చు అని ప్రచారం జరుగుతోంది. మరి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏవిధంగా అడుగులు వేస్తుంది ఏంటి అనేది చూడాలి అంటే కొంత కాలం ఆగాల్సిందే. త్వరలోనే అక్కడి అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: