ఒక పక్క కరోనాతో ప్రపంచం అల్లకల్లోలం అవుతుంటే మరో పక్క ఉగ్రవాదుల దాడులు ఏమాత్రం ఆగట్లేదు. సొంత దేశం పైనే ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు.ఇక మన పొరుగు దేశమైన అఫ్గానిస్తాన్‌లోని కాబూల్‌ పశ్చిమ ప్రాంతంలో శనివారం పెద్ద తీవ్రమైన బాంబు పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే.అఫ్గాన్‌లో మైనారిటీలైన షియాలు అధికంగా నివసించే ప్రాంతంలోని ఓ బాలికల స్కూల్‌ వద్ద శనివారం ఈ ఘటన జరిగింది. కడపటి వార్తలు అందేసరికి ఈ ఘటనలో 53 మంది ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. మరో 150మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది 11-15 ఏళ్ల మధ్య విద్యార్థినులే అని అధికారులు వెల్లడించారు.అయితే ఈ దాడికి పాల్పడింది తాము కాదంటూ తాలిబాన్‌ ప్రకటించింది.


మరే ఇతర ఉగ్ర సంస్థ ఈ పేలుడుకు ఇంకా బాధ్యత వహించుకోలేదు. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించగా, వారికి రక్తదానం చేసేందుకు భారీ స్థాయిలో ప్రజలు ఆస్పత్రుల వద్దకు చేరారు. మరణించిన వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. అఫ్గాన్‌లో మైనారిటీ షియాలపై ఉగ్రసంస్థ ఐసిస్‌ విరుచుకుపడుతోంది.ఇటీవలే ఓ బాంబు పేలుడు జరిపి పలువురు ప్రాణాలను బలిగొంది. ఈ నేపథ్యంలో తాలిబాన్‌ స్పందిస్తూ, ఇలాంటి హీనమైన పేలుళ్లకు పాల్పడేది ఐసిస్‌ మాత్రమే అని పేర్కొంది. అఫ్గాన్‌ ఇంటెలిజెన్స్‌ ఏజన్సీ సైతం ఐసిస్‌కు సాయపడుతోందని ఆరోపించింది.

ఈ దాడికి వెంటనే ఎవరూ బాధ్యత వహించలేదని, తాలిబాన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ విలేకరులతో ఒక సందేశంలో ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ మాత్రమే ఇటువంటి ఘోర నేరానికి కారణమని చెప్పారు.అఫ్ఘనిస్తాన్లో ఐఎస్ అధోకరణం చెందినప్పటికీ, ప్రభుత్వం మరియు యుఎస్ అధికారుల ప్రకారం, ఇది ముఖ్యంగా షియా ముస్లింలు మరియు మహిళా కార్మికులపై తన దాడులను వేగవంతం చేసింది.నిజానికి అఫ్గానిస్తాన్‌ కి భారత్ చాలా సహాయం చేసింది. కాని ఈ దేశం మాత్రం మత పిచ్చితో తమ దేశాలతో స్నేహాన్ని పెంచుకుంది. చివరికి సొంత వాళ్ళతోనే ఇలా బాంబు పేలుడికి గురి అయ్యింది.ఇది నిజంగా చెప్పాలంటే ఈ దేశానికి పెద్ద దరిద్రం అనే చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: