కోలీవుడ్ యంగ్ హీరో ఉదయనిధి స్టాలిన్ తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన సంగతి తెలిసిందే.స్టాలిన్ డీఎంకే పార్టీ తరపున చెపాక్ నియోజకవర్గం నుండి బరిలోకి దిగారు. అంతే కాకుండా ప్రచారంలో ప్రత్యర్థులకు చమటలు పట్టేలా స్పీచ్ లు ఇచ్చారు. స్టాలిన్ అప్పటికే సినిమా హీరో అవ్వడం ప్రచారంలో దూకుడు ప్రదర్శించడం తో ప్రజలు  అమూల్యమైన ఓట్లు వేసి గెలిపించారు. కాగా ఎమ్మెల్యే గా గెలిచిన స్టాలిన్ ఇప్పుడు సినిమాలకు దూరం అవ్వబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఇకపై ఆయన పూర్తిగా రాజకీయాలపైనే దృష్టి పెట్టాలని అనుకుంటున్నారట. అందువల్లే సినిమాలకు దూరం అవ్వబోతున్నారని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై ఇంకా స్టాలిన్ మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. కానీ స్టాలిన్ అభిమానులు మాత్రం ఆయన సినిమాలు కూడా చేయాలని కోరుకుంటున్నారట. 

తమ అభిమాన హీరోను అటు రాజకీయాల్లోనూ ఇటు సినిమాల్లోనూ చూడాలని అనుకుంటున్నారట. నిజానికి సినిమాలపై స్టాలిన్ కు ఆసక్తి  ఉంటే సినిమాలను రాజకీయాలను బ్యాలెన్స్ చేయవచ్చు. అలా బ్యాలెన్స్ చేస్తున్న నటీనటులు ఎందరో ఉన్నారు. టాలీవుడ్ లో రోజా, బాలకృష్ణ ప్రస్తుతం ఎమ్మెల్యే లుగా ప్రజా సేవ చేస్తూనే మరోవైపు సినిమాల్లో కొనసాగుతున్నారు. అంతే కాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం ఓ సినిమాలు చేస్తూనే జనసేన పార్టీని నడిపిస్తూ ఏపీ రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తున్నారు. మ‌రి స్టాలిన్ కూడా అలా చేస్తారో లేదంటే సినిమాల‌కు గుడ్ బై చెప్పి ఫుల్ టైమ్ రాజ‌కీయాల్లోకి వ‌స్తారో తెలియాలంటే ఆయ‌న నోరు విప్పాల్సిందే. ఇదిలా ఉండ‌గా స్టాలిన్ హీరోగానే కా నిర్మాత‌గా కూడా వ్య‌వ‌హ‌రించారు. 2008 లో రైడ్ జెంట్ మూవీస్ పేరుతో నిర్మాణ సంస్థ‌ను ప్రారంభించిన ఆయ‌న సెవెంత్ సెన్స్, కొర‌వి, అవ‌ధాన్ వంటి సినిమాల‌ను నిర్మించారు. అంతే కాకుండా ప్ర‌స్తుతం ఆయ‌న నాలుగు సినిమాల్లో న‌టిస్తున్న‌ట్టు టాక్.


మరింత సమాచారం తెలుసుకోండి: